📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

AP: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

Author Icon By Saritha
Updated: January 8, 2026 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొమరాడ (పార్వతీపురం మన్యం జిల్లా) : (AP) పాఠ్వతీపురం మన్యం జిల్లా వాసులకు ఏనుగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంగా ఏనుగుల గుంపు పార్వతీపురం మన్యం జిల్లాలోని (Manyam District) కొమరాడ, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, బల్జిపేట, పార్వతీపురం మండలాలలో సంచరిస్తూన్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏనుగుల గుంపు అలజడి సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో రైతులు వేసిన పంటలను పాడు చేస్తున్నాయి.

Read also: AP: నైతిక విలువలతో కూడిన విద్య అత్యంత అవసరం: ఉప శాసనసభాపతి

Elephants wreak havoc in Manyam district.

ఏనుగులను తరలించడానికి విఫల ప్రయత్నాలు

మంగళవారం రాత్రి కొమరాడ మండలం (AP) గంగరేగవలస గ్రామంలో ఏనుగుల గుంపు ప్రవేశించి రైతులు పండించిన ధాన్యాన్ని తినడంతో పాటు చిందరవందర చేశాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు మదుపులుగా పెట్టి పంట ఇంటికి తెచ్చిన తర్వాత ఏనుగుల గుంపు నాశనం చేయడంతో తీవ్రంగా నష్టపోయినట్లు రైతు కాటరావు సోములు తెలిపారు. నష్టపోయిన రైతుల కూడా నష్టపరిహారం సకాలంలో అందడం లేదని సిపిఎం పార్టీ నాయకులు సాంబమూర్తి అన్నారు.

ఇదిలా ఉంటే ఏనుగుల గుంపు పంటలను పాడు చేయడమే కాకుండా వదుల సంఖ్యలో ఇప్పటికే ప్రాణాలు విడిచినవారు ఉన్నారు. ఆయా సందర్భాలలో అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి పరామర్శించి వెళ్లడమే తప్ప ఏనుగులను తరలించే ఏర్పాట్లు నేటికీ చేయకపోవడం ఈ ప్రాంత ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి తరలిస్తారని అనేకసార్లు ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ తరలింపు ప్రక్రియ జరగపోవడంతో రైతులలో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు ఏనుగులకు జిల్లా నుంచి తరలించే ఏర్పాట్లును తక్షణమే చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AndhraPradesh CropDamage ElephantAttack FarmersLoss ForestDepartment Latest News in Telugu Mancherial Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.