📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: మహిళల కోసం ఎగ్ మార్ట్‌ల ఏర్పాటు

Author Icon By Saritha
Updated: February 5, 2026 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం (Government) మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళల కోసం, ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తోంది. తక్కువ వడ్డీకే రుణాలు, సబ్సిడీలు అందిస్తూ చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మహిళలకు ఉపాధి కల్పించే దిశగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆర్థికంగా ఎదిగేలా నగరాలు, పట్టణాల్లో ఎగ్‌మార్ట్‌లు ఏర్పాటు చేసుకునేలా సాయం అందిస్తోంది.

మెప్మా సాయంతో ఎగ్‌మార్ట్‌లతో మహిళలకు చేయూత అందిస్తున్నారు. మహిళలు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మెప్మా ద్వారా అవసరమైనవి సమకూర్చుతారు. అటు గుడ్ల వినియోగం పెంచడంతో పాటుగా ఇటు మహిళలు కూడా ప్రయోజనం పొందేలా ప్లాన్ చేశారు. మెప్మా నెక్‌తో ఒప్పందం చేసుకుని గుడ్లతో పాటుగా బండి (కార్ట్‌), వంట సామాగ్రి సమకూర్చుతున్నారు. ఈ ఎగ్‌మార్ట్‌లను మెయిన్ రోడ్లు, ముఖ్యమైన కూడళ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు.

Read Also: Vegetable Prices: ఏపీలో భారీగా పడిపోయిన టమాట ధరలు

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఆసక్తికర మహిళలు సమీపంలోని మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. (AP) అధికారులు పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేశారు. వారికి శిక్షణ అందించి ఎగ్ మార్ట్‌లను కేటాయిస్తారు. డ్వాక్రా గ్రూపుల్లోని ఒంటరి మహిళలకు ఈ కార్యక్రమం అమల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అయితే ఎగ్ మార్ట్ ఏర్పాటు చేసుకునే మహిళలు వ్యాపారానికి సంబంధించి స్వీయ ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.

వ్యాపార అనుభవం, ట్రైనింగ్‌ అంగీకారానికి సంబంధించి ధృవీకరిస్తూ ఓ పత్రం అందించాలి. స్టోర్ శుభ్రంగా ఎలా పెట్టుకోవాలి..? ఎలా విక్రయించాలి..? వ్యాపారం ఎలా పెంచుకోవాలి? అనే విషయాలపై మహిళలకు శిక్షణ అందించనున్నారు. ఈ ఎగ్ మార్ట్‌ల ఏర్పాటుతో మహిళలు ఎక్కువగా ఆదాయం పొందవచ్చని మెప్మా అధికారులను చెబుతున్నారు. మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Government DWCRA women Egg Marts Latest News in Telugu MEPMA scheme Self Employment Telugu News Women Empowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.