ఆంధ్రప్రదేశ్(AP Education)లో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రీఫైనల్ పరీక్షలను ఫిబ్రవరి 17 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనున్నాయి.
Read also: AP Government: ఆర్టీసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం
ప్రీఫైనల్ పరీక్షలు పూర్తైన తర్వాత విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఆపై రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు(SSC Exam Schedule) జరగనున్నాయి. ఈ వరుస పరీక్షల ద్వారా విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
సంక్రాంతి సెలవుల తర్వాత పదో తరగతి పరీక్షల సందడి
ఇదిలా ఉండగా, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 10 నుంచి 18 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమై, పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యార్థులు పరీక్షలకు సక్రమంగా సిద్ధమవ్వాలని, ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు మరియు పునశ్చరణ కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు అవసరమైన సహకారం అందించాలని కోరింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: