📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

AP Education: దేశవ్యాప్తంగా నాలుగు ఎన్ఐటిటిటి కేంద్రాలు

Author Icon By Rajitha
Updated: February 10, 2026 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పరిశ్రమలకు తగ్గట్లుగా సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ

చెన్నై సంస్థకు అనుబంధంగా వ్యవసాయ విస్తరణ కేంద్రం

మారుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్యను తీర్చిదిద్దేందుకు *జాతీయ సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ మరియు పరిశోధన సంస్థలు (NITTTR)కు ‘డీమ్డ్ టు యూనివర్సిటీ’ హోదా కల్పించినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. ఎన్ఐటిటిఆర్ ద్వారా వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు కోరుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు సోమవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. దేశంలో ఉన్న మొత్తం నాలుగు జాతీయ సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ మరియు పరిశోధన సంస్థల (NITTTR) ద్వారా గత ఐదేళ్లలో 4,45,074 మంది సాంకేతిక ఉపాధ్యాయులకు శిక్షణ అందించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకోసం ఐదేళ్ల కాలంలో ₹776.57 కోట్ల నిధులు వెచ్చించినట్లు తెలిపారు.

Read also: Ghee Controversy : కల్తీ జరిగింది మీ హయాంలో కాదా ? – విడదల రజనీ

Four NITTT centers across the country

NITTTR సంస్థాగత బలోపేత చర్యల్లో భాగంగా అవసరాల ఆధారిత సాంకేతిక అధ్యాపక శిక్షణ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. తక్కువ భాగస్వామ్యం ఉన్న రాష్ట్రాల్లో శిక్షణ లోపాలను గుర్తించేందుకు ప్రాంతీయ సహకారం, కోర్సుల సమాచార ప్రచారం, సామాజిక మాధ్యమాల వినియోగం, అలాగే స్థానిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రంగాల వారీ శిక్షణ కార్యక్రమాల రూపకల్పన జరుగుతోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో NITTTR సేవలపై ప్రత్యేకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, భారత ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రధాన NITTTR సంస్థలు భోపాల్, చండీగఢ్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటికి అనుబంధంగా విజయవాడ (ఆంధ్రప్రదేశ్) సహా పలు ప్రాంతాల్లో విస్తరణ కేంద్రాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.

2016లో స్థాపించబడిన చెన్నై NITTTR సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయవాడ విస్తరణ కేంద్రం ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరిలోని సాంకేతిక విద్య, శిక్షణ మండలి ప్రాంగణం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల పరిధిని విస్తరించేందుకు జాతీయ విద్యా విధానం (NEP)–2020కు అనుగుణంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని మంత్రి చెప్పారు. ఇందులో స్వయం అభ్యాసానికి తోడ్పడే ఆన్‌లైన్ ఓపెన్ కోర్సులు SWAYAM వేదిక ద్వారా అందించడం, అలాగే ‘ప్రశిక్షణ్’ అనే లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉందని తెలిపారు. రాష్ట్ర సాంకేతిక విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు మరియు ఇతర ఉన్నత విద్యాసంస్థలతో సహకారాన్ని పెంచుతూ అవసరాల ఆధారిత కార్యక్రమాలు, సామర్థ్య అభివృద్ధి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో శిక్షణ మాడ్యూళ్ల అభివృద్ధి కూడా జరుగుతోందని ఏలూరు ఎంపీకి ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:


Deemed University Status latest news NEP 2020 NITTTR Prashikshan LMS Sukanta Majumdar SWAYAM Courses Technical Teacher Training Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.