📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది

AP: బెంగళూరు టు విజయవాడ డ్రగ్స్

Author Icon By Saritha
Updated: December 23, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : విజయవాడలో మరోసారి డ్రగ్స్(Drugs) కలకలం రేగింది. బెంగళూరు(AP) నుంచి ఎండీఎంఏ తీసుకొచ్చి విజయవాడలోని ఓ హోటల్లో వాటిని వాడి మత్తులోతూగుతున్న క్రమంలో పోలీసులు దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నారు. వీరి నుంచి మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి, వారు ఉపయోగించిన కారుతో సహా స్టేషన్ కు తరలించారు. పోలీసులకు మస్కా కొట్టి ఓ నింది తుడు కారులో పరారయ్యాడు. పోలీసులు తేరుకుని పరారైన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. విజయవాడ నగరంలోని మధురానగర్కు చెందిన వెంకట జగదీష్ కుమార్, సింగ్నగర్ ప్రాంతానికి చెందిన అఖిలేష్ అలియాస్ అఖిల్ ఇంటర్ అయిన తర్వాత చదువు మానేశారు. వీరు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. స్నేహితులు ఇచ్చే పార్టీల్లో ఎండీఎంఏ అలవాటైంది. దీంతో తరచూ బెంగళూరు వెళ్లి అక్కడ కొనుగోలు చేసి విజయవాడ తెచ్చేవారు. ఇక్కడ మత్తుమందును స్నేహితులతో కలిసి తీసుకునేవారు.

Read Also: Pawan Kalyan: డిప్యూటీ సీఎం ఇప్పటం పర్యటన వాయిదా

Drugs transported from Bengaluru to Vijayawada.

బెంగళూరు నుంచి విజయవాడకు డ్రగ్స్ తరలింపు

ఈనెల 19న కారులో వీరిద్దరూ బెంగళూరుకు బయలుదేరారు. 20వ తేదీన అక్కడకు చేరుకున్నారు. మహేష్ వద్దకు వెళ్లి రూ.36 వేలు చెల్లించి 19 గ్రాముల డ్రగ్స్ కొనుగోలు చేశారు. ఇంతలో వీరు బెంగళూరు వెళ్లిన విషయాన్ని జగదీష్ స్నేహితుడు జకీర్ ద్వారా నెల్లూరుకు చెందిన రాజేష్ తెలుసుకున్నాడు. (AP) వెంటనే జగదీష్ కుమార్ కు ఫోన్ చేసి తనకు తెలిసిన తేజ అనే వ్యక్తి నుంచి 2 గ్రాములు ఎండీఎంఏ తీసుకురావాలని కోరాడు. పాత బకాయి కూడా ఇవ్వాల్సి ఉందని చెప్పి ఇందుకు గాను రూ.20 వేలు జగదీష్ కుమార్ యూపీఐ ఖాతాకు బదిలీ చేశాడు. దీనిని జగదీష్ తొలుత తిరస్కరించాడు. పోలీసుల నిఘా ఉందని చెప్పి, ఆ రూ.20 వేలును తిరిగి రాజేష్ ఖాతాకు వెనక్కి పంపించాడు. తర్వాత బతిమలాడి జగదీష్ను ఒప్పించి, డబ్బులు పంపించాడు. తర్వాత తేజ వద్ద రెండు గ్రాములు తీసుకుని కారులో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో నెల్లూరులో దిగి రాజేష్కు ఎండీఎంఏ ఇచ్చారు. అక్కడ వారు కొంత డ్రగ్స్
తీసుకున్నారు. జగదీష్ కారు మొరాయించడంతో అక్కడే వదిలేసి, రాజేష్ కారులో ముగ్గురూ విజయవాడ చేరుకున్నారు. విజయవాడకు చేరుకున్న తర్వాత మాచవరం స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో దిగారు. ముగ్గురూ డ్రగ్స్ తీసుకుని మత్తులో మునిగి తేలారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు హోటల్పై దాడి చేసి, నిందితులను పట్టుకున్నారు.

10 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

వీరి నుంచి 10 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను తీసుకుని మాచవరం స్టేషన్లో కారుతో సహా అప్పగించారు. కారును బయట పార్క్ చేసే సమయంలో డోర్ లాక్ పడకపోవడంతో రాజేష్కు లాక్ వేయమని పోలీసులు చెప్పడంతో అతను కారు ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేసి రెప్పపాటులో స్టేషన్ నుంచి పరారయ్యాడు. పోలీసుల ఏమరుపాటు కారణంగా స్టేషన్ బయట నుంచే పారిపోయాడు. పోలీసులు తేరుకునే సరికే మాయమయ్యాడు. తర్వాత అప్రమత్తమై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాజేష్ కోసం గాలిస్తున్నారు. మిగిలిన ఇద్దరు జగదీష్ కుమార్, అఖిలేష్ను అరెస్టు చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులో వీరికి ఎండీఎంఏ అమ్మిన మహేష్, తేజ కోసం మరో బృందం బెంగళూరు వెళ్లింది. టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితులను తీసుకుని మాచవరం స్టేషన్లో కారుతో సహా అప్పగించారు. కారును బయట పార్క్ చేసే సమయంలో డోర్ లాక్ పడకపోవడంతో రాజేష్కు లాక్ వేయమని పోలీసులు చెప్పడంతో అతను కారు ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేసి రెప్పపాటులో స్టేషన్ నుంచి పరారయ్యాడు. పోలీసుల ఏమరుపాటు కారణంగా స్టేషన్ బయట నుంచే పారిపోయాడు. పోలీసులు తేరుకునే సరికే మాయమయ్యాడు. తర్వాత అప్రమత్తమై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాజేష్ కోసం గాలిస్తున్నారు. మిగిలిన ఇద్దరు జగదీష్ కుమార్, అఖిలేషు అరెస్టు చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులో వీరికి ఎండీఎంఏ అమ్మిన మహేష్, తేజ కోసం మరో బృందం బెంగళూరు వెళ్లింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bangalore to Vijayawada Drugs Drug bust drug trafficking Hotel Raid Latest News in Telugu MDMA Seizure Task Force Police Telugu News Two Arrested Vijayawada police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.