📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: AP Crime: సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్రగ్స్ డాన్ అరెస్ట్

Author Icon By Sushmitha
Updated: November 10, 2025 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్(Drugs) మహమ్మారిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రకటించిన యుద్ధంలో పోలీసులకు కీలక విజయం లభించింది. సీఎం ఆదేశాలతో డ్రగ్స్ ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టిన ఏపీ పోలీసులు, మోస్ట్ వాంటెడ్ డ్రగ్ తయారీదారు మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

Read Also: TG: ఈ నెల 19న మహిళలకు చీరల పంపిణీ

AP Crime

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు

అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లెకు చెందిన మధుసూదన్ రెడ్డి,(Madhusudhan Reddy) బెంగళూరు కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కదలికలపై కొంతకాలంగా నిఘా ఉంచిన పోలీసులు, పక్కా సమాచారంతో బెంగళూరులో అతడిని పట్టుకున్నారు.

ముందస్తు అరెస్టులు, దర్యాప్తు పురోగతి

గత సెప్టెంబర్ నెలలో, బెంగళూరు నుంచి విశాఖపట్నం డ్రగ్స్ తరలిస్తున్న శ్రీవాత్సవ్, హవి అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో మడ్డి పేరు బయటకు వచ్చింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేయగా, ఎట్టకేలకు అరెస్ట్ చేయడంతో ఈ కేసులో కీలక పురోగతి లభించినట్లయింది. ప్రస్తుతం మడ్డిని విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. అతడిని విచారిస్తే డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు, సూత్రధారుల వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతాయని పోలీసు వర్గాలు తెలిపాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Bangalore drugs Chandrababu Naidu cyberabad drugs case Drug Mafia Drugs Case Google News in Telugu Latest News in Telugu Maddi alias Madhusudhan Reddy Telugu News Today visakhapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.