News Telugu: AP: కోనసీమ జిల్లాలో రన్నింగ్ బస్సులో డ్రైవర్ కు గుండెపోటు..

Read Time:  1 min
AP
AP
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి హైవేపై హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులతో నిండిన బస్సును నడుపుతున్న డ్రైవర్ డి. నారాయణరాజు అకస్మాత్తుగా గుండెపోటుకు (Heart attack) గురయ్యాడు. ఆ సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు. తన ప్రాణాలు విడుస్తున్న వేళ, వారిని రక్షించేందుకు డ్రైవర్ చివరి క్షణాల్లో చూపిన అప్రమత్తత అందరినీ కదిలించింది.

Read also: Montha Effect: ఏపీలో 1.64 లక్షల హెక్టార్లలో పంట నష్టం

AP

AP: కోనసీమ జిల్లాలో రన్నింగ్ బస్సులో డ్రైవర్ కు గుండెపోటు..

ఆ వెంటనే స్టీరింగ్ పై వాలిపోయారు

బస్సు రోడ్డుపై వేగంగా సాగుతుండగా అకస్మాత్తుగా ఛాతి నొప్పి వచ్చి నారాయణరాజు పరిస్థితి విషమమైంది. అయినప్పటికీ ఆయన గబాలిగా బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఆపేశారు. ఆ వెంటనే స్టీరింగ్ పై వాలిపోయారు. విద్యార్థులు ఆయన అస్వస్థతను గమనించి వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే, వైద్య సాయం అందేలోపే నారాయణరాజు మరణించారు. ఆయన చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి వల్లనే 50 మంది విద్యార్థులు ప్రమాదం నుండి తప్పించుకున్నారు. తన చివరి శ్వాస వరకు విధి నిర్వహణ చేసిన నారాయణరాజు త్యాగం అందరికీ కంటతడి పెట్టించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.