విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోని మధురవాడ జోన్‌లో ఉన్న 5, 6 వార్డుల ప్రజలకు ఎప్పటినుంచో తాగునీటి సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితికి త్వరలోనే ముగింపు పలకనున్నారు. సాయిరాంకాలనీ కొండపై నిర్మిస్తున్న కొత్త రిజర్వాయర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు నిరంతర తాగునీరు అందుబాటులోకి రానుంది.
Read also: AP: రీసైక్లింగ్ పరిశ్రమలకు 40 శాతం రాయితీ
Drinking water problems for Visakhapatnam residents come to an end
రూ.3.5 కోట్లతో శరవేగంగా సాగుతున్న రిజర్వాయర్ పనులు
అమృత్ 2.0 పథకం కింద గతంలో ప్రారంభమైన ఈ రిజర్వాయర్ పనులు నిధుల లేమితో కొంతకాలం నిలిచిపోయాయి. తాజాగా కూటమి ప్రభుత్వం స్పందించి అవసరమైన నిధులను మంజూరు చేయడంతో పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. మొత్తం రూ.3.5 కోట్ల వ్యయంతో సాయిరాంకాలనీ కొండపై నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్‌ను మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
31 వేల మందికి వేసవిలోనూ నిరంతర తాగునీరు
ఈ రిజర్వాయర్ పూర్తయితే సుమారు 31 వేల మంది ప్రజలకు తాగునీటి కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని అధికారులు చెబుతున్నారు. సాయిరాంకాలనీ ఫేజ్-1, 2, 3, శ్రీనివాస్‌నగర్, డ్రైవర్స్‌కాలనీ, వైభవ్‌నగర్, ప్రశాంతినగర్, కొమ్మాది గ్రామం, హౌసింగ్‌బోర్డుకాలనీ, అమరావతికాలనీ, సేవానగర్, దేవిమెట్ట, రిక్షాకాలనీ వంటి అనేక ప్రాంతాలకు నీటి సరఫరా మెరుగుపడనుంది.
డ్రమ్ములు, మోటార్ల బాధకు ఇక గుడ్‌బై
ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లోని ప్రజలు వేల రూపాయలు ఖర్చుచేసి డ్రమ్ముల్లో నీటిని తెప్పించుకోవాల్సి వచ్చేది. మోటార్ల సాయంతో నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి ఉండేది. కొత్త రిజర్వాయర్ అందుబాటులోకి వస్తే ఈ కష్టాలన్నీ గతమవుతాయి. ఎండాకాలంలో కూడా ఎలాంటి నీటి ఇబ్బందులు ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నాటికి తప్పనిసరిగా నీటి సరఫరా ప్రారంభిస్తామని హామీ ఇస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: