మండలిలో సమయపాలన.. ఉదయం 10 నుంచి 1.30వరకు సభ
సచివాలయం: ప్రజా సమస్యలు ప్రతిబింబించేలా చర్చలు జరగాలని చైర్మన్ కొయ్యే మోషేను (Koyye Moshe) రాజు పిలుపునిచ్చారు. (AP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున మంత్రులు, విపక్ష నేతలు అన్నీ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సభను అర్థవంతంగా, క్రమశిక్షణతో నిర్వహించడమే లక్ష్యంగా పలు కీలక మార్గదర్శకాలను చైర్మన్ ఖరారు చేశారు.
సమావేశాల షెడ్యూల్పై చర్చించిన బిఏసి, ప్రతిరోజూ ఉదయం 10.00గంటలకు సభను ప్రారంభించి, మధ్యాహ్నాం 1.30గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రజలకు సంబంధించిన కీలక బిల్లులు, బడ్జెట్ అంశాలపై చర్చించేందుకు తగిన సమయం కేటాయించడమే కాకుండా, సభా సమయాన్ని వృధా చేయకూడదని చైర్మన్ స్పష్టంచేశారు. సాధారణంగా సభలో ప్రశ్నోత్తరాల సమయం సుదీర్ఘంగా సాగుతుంటుంది. దీన్ని క్రమబద్ధీకరించేందుకు బిఏసి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది.
Read Also: Andhra Pradesh politics: ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్ డిన్నర్ మీటింగ్ లు
అధికార, ప్రతిపక్ష పార్టీలు సమన్వయంతో వ్యవహరించాలి
(AP) ప్రశ్నోత్తరాల సమయాన్ని గరిష్టంగా 90 నిమిషాలకు పరిమితం చేశారు. తద్వారా ఇతర సభా వ్యవహారాలకు, బిల్లులపై చర్చకు ఆటంకం కలగకుండా చూడవచ్చని భావించారు. సభ్యులు అడిగే ప్రశ్నలు సుదీర్ఘ ప్రసంగాల మాదిరిగా ఉండకూడదని, నేరుగా సమస్యను ప్రస్తావించాలని చైర్మన్ సూచించారు. అదేవిధంగా మంత్రులు కూడా తమ సమాధానాలను సాగదీయకుండా, గణాంకాలు మరియు వివరాలతో క్లుప్తంగా వివరించాలని కోరారు. ప్రశ్నలు క్లుప్తంగా ఉంటేనే ఎక్కువ మంది సభ్యులకు అవకాశం లభిస్తుందని గుర్తుచేశారు. సభ సజావుగా సాగేలా అధికార, ప్రతిపక్ష పార్టీలు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. బిఏసిలో తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించాలని, సభా గౌరవాన్ని కాపాడలని సూచించారు. ఈ సమావేశంలో శాసనసభ వ్యవహారాల మంత్రి, ప్రతిపక్ష నేత ఇతర పార్టీల ముఖ్యనేతలు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. బడ్జెట్ కేటాయింపులు, సంక్షేమ పథకాలు రాష్ట్రాభివృద్ధిపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: