శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. (AP) వాతావరణం చల్లగా మారింది. ఉదయం 9గంటలకు కానీ సూర్యుడు దర్శనం ఇవ్వటం లేదు. పొగమంచుతో శ్రీకాళహస్తి (Srikalahasti) పుణ్యక్షేత్రం కప్పివేయబడింది. అంతేకాక చలి వణికిస్తున్నా శివయ్య సేవకు భక్తులు కడలి తరంగాల్లా కదలి వచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ఇసుకేస్తే రాలనంత రద్దీ చోటు చేసుకుంది. వేకువ జాము నుంచే ఆలయంలో భక్తులు శివనామస్మరణ చేస్తూ పునీతం పాతిక వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు ఆలయ ఇఓ డి. బాపిరెడ్డి వివరించారు.(AP) రాహుకేతుదోష నివారణ పూజలు సుమారు 6వేలు జరిగినట్లు వివరించారు. ఇక సంస్కరణలతో ప్రతి ఒక్కరు టిక్కెట్లు కొనుగోలు చేయాలనే నిబంధనలతో ప్రత్యేక దర్శనానికి వెళ్ళె భక్తులు అతిధులు సుమారు 8వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు వివరించారు.
Read Also: AP: వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: