📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

AP: చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

Author Icon By Saritha
Updated: January 9, 2026 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోవూరు (నెల్లూరు) : (AP) రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు తీస్తున్న ఘనత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకే (CM Chandrababu) సాధ్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరు మండలం లేగుంటపాడులోని పద్మజ ఆడిటోరియంలో గురువారం 329 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా రైతులకు ఉపయోగం లేని పాస్ పుస్తకాలు అందజేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని సరిదిద్ది రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను కోవూరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఇప్పటివరకు 24979 మంది రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ 19 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో కోవూరు నియోజకవర్గంలో ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

Read also: Chittoor: పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

Development is possible only with Chandrababu: MLA Prashanthi Reddy

సూపర్ సిక్స్ ప్రాజెక్టులలో ఘనత కూటమి ప్రభుత్వంకే

ఎన్నికల్లో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కిందన్నారు. (AP) అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రోడ్లు కూడా శరవేగంగా రూపుదిద్దు కుంటున్నాయన్నారు. రైతుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందన్నారు. గత ఐదేళ్లలో అభివృద్ధికి నోచుకోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమని, ఇది పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞుతలు తెలుపుతున్నామన్నారు. ఇప్పటికే లేగుంటపాడు గ్రామంలో ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గ్రామ సర్పంచ్ వేణుగోపాల్ అడిగిన మీదట మరో 10 లక్షలు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామని ప్రజల హర్షద్వానాల నడుమ ప్రకటించారు.

అనంతరం రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీహెచ్ సుబ్బయ్య, డిప్యూటీ తహసీల్దార్ మధుసూదన్రావు, పెన్నా డెల్టా ఆయకట్టు చైర్మన్ జెట్టి రాజగోపాల్రెడ్డి, జొన్నవాడ దేవస్థాన చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డిసొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్రెడ్డి ట్రాన్కో డీఈ మధుసూదన్రెడ్డి, ఏఈ ప్రదీప్.. గ్రామ సర్పంచ్ వేణుగోపాల్రెడ్డి, ఎంపీపీ టి. పార్వతి, సర్పంచ్లు అమరావతి, విజయమ్మ, మాజీ ఎంపీపీ ఉమా, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులురెడ్డి, సునీల్ రెడ్డి, నాగరాజు, సీహెచ్ చిన్నయ్య, రమేష్ యాదవ్, డి. శ్రీనివాసులు నాయుడు, బాల రవి, నాటకరాణి వెంకట్, వై. వెంకటరమణమ్మ, శ్రీనివాసులు, దాసరి మురళి, దామోదర్ నాయుడు, చింతలపూడి పెంచలయ్య, కూటమి నాయకులు సీహెచ్ శ్రీనివాసులురెడ్డి, పోలిశెట్టి వెంకట సుబ్బారావు, రైతులు ఉన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh Development Chandrababu Naidu Coalition Government farmer welfare Kovur Constituency Latest News in Telugu Pattadar Passbooks Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.