జనవరి 25న మహారాష్ట్రలోని నాందేడ్ (Nanded) పట్టణంలో ఆంధ్రప్రదేశ్ (AP) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు చేరుకుని, శ్రీ హజూర్ సాహిబ్ జీ గురుద్వారాను దర్శించుకుంటారు. అక్కడ సిక్కు సంప్రదాయం ప్రకారం తలపాగా ధరించి, చౌర్ సాహిబ్ సేవ, అర్దాస్ కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. గురుద్వారా కమిటీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు, సత్కారం చేయనున్నారు.
Read Also: SCR: వీక్లీ స్పెషల్ రైళ్ల సేవల పొడిగింపు
ప్రధాన దర్బార్ కార్యక్రమం
మధ్యాహ్నం 2.10కు శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ జీ 350వ షహీదీ సమాగమంలో పవన్ పాల్గొననున్నారు. అ తర్వాత సాయంత్రం 4 గంటలకు మోదీ మైదాన్ లో, నిర్వహించే ప్రధాన దర్బార్ కార్యక్రమానికి హాజరవుతారు. ఆ కార్యక్రమం అనంతరం సాయంత్రం 4.30కు నాందేడ్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి తిరుగు ప్రయాణం అవుతారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: