ఆంధ్రప్రదేశ్‌లోని (AP Crime) కర్నూలు జిల్లా నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయంలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మధుశేఖర్ కార్యాలయ బాత్రూంలో ఆత్మహత్యకు యత్నించాడు. తోటి ఉద్యోగులు గమనించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Read Also: ACB Raids: ఏపీలో పలుచోట్ల ACB సోదాలు
ఆత్మహత్యయత్నం పాల్పడటం పై పలు అనుమానాలు
బాదితుడి బంధవులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన మల్లమ్మ, చిన్న బాలయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు,పెద్ద కుమారుడైన మధు శేఖర్ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. గోస్పాడు మండలం నెహ్రూ నగర్ లో ఆరు సంవత్సరాలు విధులు నిర్వహించిన మదుశేఖర్ గత సంవత్సరం జరిగిన బదిలీలలో బిల్లలాపురంలో విధులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం సచివాలయం పైన ఉన్న బాత్ రూమ్‌కని వెళ్లిన మధుశేఖర్ ఎంత సేపటికి రాకపోవడం అనుమానం వచ్చిన తోటి ఉద్యోగులు పైకి వెళ్ళి చూశారు.
అక్కడ అపస్మారక స్థితిలో రక్తపు మడుగులో పడిపోయి ఉన్న మధును చూసి షాక్ అయ్యారు. వెంటనే అంబులెన్స్ సహాయంతో మధుశేఖర్ ను నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కత్తితో చెయ్యి, గొంతు కోసుకొని అత్మహత్యయత్నం పాల్పడటంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కొరకు కర్నూలు తరలించారు.ఉద్యోగి మధుశేఖర్ కత్తితో గొంతు, చెయ్యి కోసుకొని ఆత్మహత్యయత్నం పాల్పడటం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్యయత్నంకు ప్రేమ వ్యవహారమా,అర్థిక ఇబ్బందులా, మరే ఇతర కారణాలు ఏమైన ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: