విద్యార్థులకు సన్మార్గం చూపాల్సిన గురువు కీచకుడిగా మారాడు. కోనసీమ(AP Crime) జిల్లా ఐ.పోలవరం మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై పీఈటీ టీచర్ రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ అలియాస్ బాబీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చాక్లెట్లు ఇస్తానని చెప్పి బాలికను రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.
Read Also: Hanumakonda Accident: రోడ్డు ప్రమాదం లో ముగ్గురి మృతి తో పెళ్లింట్లో విషాదం
చాక్లెట్ల మాయతో మైనర్‌పై అఘాయిత్యం
విషయం బయటపడిన(AP Crime) తర్వాత బాలిక తల్లి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆదేశాల మేరకు పోలీసులు పోక్సో చట్టం మరియు సెక్షన్ 725 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు బాబీ ఒక రాజకీయ పార్టీలో కూడా చురుకుగా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అదే స్కూల్లో చదువుతున్న మరో మైనర్ బాలికపై కూడా అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.
తాత ముసుగులో కీచకుడు – తుని ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం
ఇటీవల తుని రూరల్ గురుకుల పాఠశాలలో మరో దారుణం చోటు చేసుకుంది. 62 ఏళ్ల తాటిక నారాయణరావు అనే వృద్ధుడు, తన మనవరాలి వయసున్న 8వ తరగతి బాలికను హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ ఘటనను గమనించిన స్థానికులు వీడియో తీసి పోలీసులకు అందించడంతో నిజం బహిర్గతమైంది.
పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం(POCSO Act) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తుండగా, నారాయణరావు తుని శివారులోని కోమటిచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన మరియు చర్చలకు దారితీసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: