AP Crime: తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో అత్యంత కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. తన చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో, ఒక యువకుడిని ఆమె సోదరులు రాళ్లతో కొట్టి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీనిని స్థానికులు ‘పరువు హత్య’గా అభివర్ణిస్తున్నారు.
Read Also: Godavari Pushkaralu 2027: కుంభమేళా రేంజ్లో గోదావరి పుష్కరాలు
పక్కా ప్లాన్‌తో దాడి
జెడ్. మేడపాడు గ్రామానికి చెందిన ఒక యువతి, వేములపల్లికి చెందిన పోలపల్లి సూర్య ప్రకాష్ (40) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో, ఈ జంట గురువారం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వివాహం చేసుకున్నారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా, కుటుంబ పరువు తీస్తూ పెళ్లి చేసుకున్నాడన్న కక్షను యువతి సోదరులు మనసులో పెంచుకున్నారు. అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్న జంట స్వగ్రామానికి వెళ్తుండగా ప్లాన్ చేసి మరీ హతమార్చారు.
ప్రాణం తీసిన పగ
వేములపల్లి వెళుతున్న తరుణంలో యువతి అన్నదమ్ములు దారి కాసి సూర్య ప్రకాశ్‌ను పట్టుకున్నారు. సూర్య ప్రకాష్‌ను తీవ్రంగా కొట్టి, రాళ్లతో మోదీ అత్యంత దారుణంగా హతమార్చారు. అనంతరం పారిపోయేందుకు యత్నిస్తున్న నిందితులను స్థానికులు పట్టుకుని స్తంభానికి కట్టేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హత్య చేసిన అన్నదమ్ములను, వారికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: