📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

AP Crime: కర్నూలులో రాజు వెడ్స్ రాంబాయి మూవీ సీన్ రిపీట్.. 

Author Icon By Anusha
Updated: January 25, 2026 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత ఏడాది విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) సినిమా వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఇల్లెందు (Yellandu) ప్రాంతంలో జరిగిన ఓ దారుణ ఘటనను ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. కుమార్తె తనకు నచ్చని వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో కన్నతండ్రే ఆమెకు హెచ్ఐవీ (HIV) పాజిటివ్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన సంఘటన ఈ సినిమా కథలో ప్రధానంగా ఉంటుంది. ఈ కథ ప్రేక్షకులను కలచివేసింది.ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ (AP Crime) లోని కర్నూలులో వెలుగు చూసింది.

Read Also: HYD: నాంపల్లిలో అగ్నిప్రమాదం..ఐదుగురు సజీవ దహనం?

సినిమాను తలపించిన కర్నూలు ఘటన

కర్నూలుకు చెందిన ఓ డాక్టర్‌కి చదువుకునే సమయంలో వసుంధర అనే మహిళతో పరిచయం ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. దీంతో డాక్టర్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఓ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. భార్య భర్తలు ఇద్దరూ ఎంతో సంతోషంగా హాయిగా జీవిస్తున్నారు. అయితే తన ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన వసుంధర ఎలాగైనా అతడి భార్యను అడ్డు తొలగించుకుని ఆ ప్లేస్‌లోకి తాను రావాలని కలలు కంది.

అంతే అందుకు తగినట్లుగా స్కెచ్ కూడా వేసింది.ఈ ఏడాది జనవరి 9వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్న ప్రియుడి భార్య స్కూటీపై వెళుతుంటే ప్లాన్ ప్రకారం ఆమెను బైక్ తో ఢీ కొట్టారు. ఈ క్రమంలోనే శ్రావణి స్కూటీపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యేలా ప్లాన్ వేసింది వసుంధర. చేసినట్లుగానే ఆమె బైక్ మీద నుంచి పడిపోయింది.

AP Crime: Raju Weds Rambai movie scene repeated in Kurnool..

కేసు నమోదు

దీంతో బాధితురాలికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ ముగ్గురు మహిళలు అక్కడికి వచ్చారు. బాధితురాలిని ఆటోలో ఎక్కించారు. అప్పటికే ఆటోలో ఉన్న వసుంధర ఆమెపై వైరస్‌ ఇంజెక్షన్‌తో దాడి చేసింది. ఈ విషయాన్ని గమనించిన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. దీంత వసుంధరతోపాటు మిగిలిన మహిళలు కూడా అక్కడ నుంచి పరార్ అయ్యారు.తనకు ఏదో ఇంజెక్షన్ ఇచ్చారని గ్రహించిన బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.అయితే వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది.

ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త డాక్టర్ ఆరా తీశాడు. సాంకేతిక ఆధారాలతో తన మాజీ ప్రియురాలు వసుంధర ఈ ఘోరానికి ఒడిగట్టింది అని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.సీసీ కెమెరా పుటేజి ఆధారంగా… నిందితురాలు వసుంధరతోపాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

HIV Crime kurnool latest news Raju Weds Rambai Real Incident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.