హిందూపురం : ఐదు నెలల కిందట దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 12 కేజీల బంగారు భారీ దోపిడీ కేసును హిందూపురం పోలీసులు ఛేదించారు. సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గురువారం హిందూపురం ఆప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గతేడాది జులై 27న హిందూపురం మండలం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న తూముకుంట పారిశ్రామిక వాడలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు దోపిడీ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 12 కేజీల బంగారు ఆభర ణాలు, లక్షలాది రూపాయల సొమ్ము చోరీ జరిగింది. డి.ఎస్.పి మహేష్ నేతృతంలో అప్ గ్రేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, పోలీస్ బృందం పెద్ద ఎత్తున ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాలకు వెళ్లి విచారణ చేపట్టి రెండు నెలల కిందట రెండు కేజీల బంగారం రికవరీ చేశారు.
Read also: AP: సుపరిపాలనను అందిస్తునాం అన్నా రామనారాయణ రెడ్డి
AP Crime
ఈ క్రమంలో ఈ కేసు విచారణను మరింత ముమ్మరం చేశారు. కాగా ఏడాది కిందట కోయంబత్తూర్ జైలులో హర్యానాకు చెందిన అనిల్ కుమార్, రాజస్థాన్ చెందిన ఇషార్ ఖాన్ మధ్య స్నేహం ఏర్పడి భారీ దోపిడీలు చేయాలని నిర్ణయించారు. వీరిద్దరూ జైలు నుంచి విడుదలయ్యాక ఒక ద్విచక్ర వాహనం తీసుకొని ఐదు ఆరు నెలలపాటు 14000 కిలోమీటర్ల వరకు వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించి చివరకు హిందూపురం సమీపంలోని తూముకుంట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను సెలెక్ట్ చేసుకున్నారు. వీరిద్దరూ ఇక్కడ దోపిడీకి పాల్పడి బెంగళూరు మీదుగా ఢిల్లీకి పారి పోయారు. విచారణలో అనిల్ కుమార్ పోలీసులకు చిక్కడంతో మొదట్లో రెండు కేజీల బంగారం రికవరీ అయింది.
ఈ విషయం తెలుసుకొని తనను కూడా ఏపీ పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో ఇషార్ ఖాన్ ఓ పాత కేసులో అక్కడి పోలీసులకు లొంగిపోయి జైలుకు వెళ్లాడు. అక్కడి కోర్టులో పిటి వారింట్ను వేసి అతడిని అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహించా మని ఎస్పీ చెప్పారు. తన బ్యాచ్ మెంట్ ఐపీఎస్ల సహకారంతో, అక్కడి స్థానిక పోలీసుల సహకారంతో కేసును చేదించామని చెప్పారు. ఇతడి నుంచి మూడున్నర కేజీల బంగారం రికవరీ చేశారు. కాగా చోరీ అయిన దాదాపు 12 కేజీలలో కరిగించిన తర్వాత బంగారం 10.3 కేజీలు అయిందని చెప్పారు. ఇప్పటిదాకా మొత్తం 5.5 కేజీల బంగారం రికవరీ చేశామని అన్నారు. నేపాల్లో అనిల్ కుమార్ జూదం ఆడి భారీగా ఖర్చు చేశాడని, మరోవైపు ఇషార్ కాన్ రెండు జెసిబిలు కొని ఇంటి నిర్మాణం తన ప్రాంతంలో చేపట్టాడన్నారు.
మిగిలిన సొత్తు రికవరీకి కోసం ప్రాపర్టీ అటాచ్ మెంట్ చేసేందుకు ఆ రాష్ట్రాల ప్రభుత్వలతో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసును చాలెంజిగా తీసుకొని చేదించిన డిఎస్పి మహేష్, సిఐ ఆంజనేయులును ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. బ్యాంకుల్లో వాచ్ మెన్లను నియమించుకోవాలని, అలారం ఏర్పాటు చేసుకొని, సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లను తగిన విధంగా భద్రత పరుచుకునేందుకు బ్యాంకు యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఎక్కడైనా అనుమానితులపై సమాచారం ఉంటే పోలీసులకు చెప్పాలని ఎస్పీ కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: