ఆంధ్రాలో ఇద్దరు ఎంబిబిఎస్ విద్యార్థుల ఆత్మహత్య
చదువే జీవితం కాదు. ఈలోకం అక్షరజ్ఞానం లేనివారు కూడా బాగానే బతుకుతున్నారు. చదువు ప్రధానమే కానీ అది ప్రాణాలు,తీసుకునేంతలా ఉండకూడదు. గొప్ప డాక్టర్లు కావాలనే ఆశతో ఎంతోకష్టపడి చదివి నీట్ ఎంట్రెన్స్ (NEET Entrance) రాసి, మెడికల్ కాలేజీలో చేరిన,ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖ గీతం కాలేజీలో విషాదం
విశాఖ గీతం మెడికల్ కాలేజీ (Geetam Medical College) లో హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విస్మాద్ సింగ్ (20)ఆత్మహత్య చేసుకున్నారు. ఈలోకంలో నేను బతకలేను. నాకు మరో జన్మ వద్దని సూసైడ్ నోటు రాసి, కాలేజీ ఆరో అంతస్తు నుంచికిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో విస్మాద్ సింగ్ (Vismad Singh) స్పాట్ లోనే మరణించారు. జోత్స్నఅనే యువతి విశాఖ ఎన్ఆర్ కాలేజీలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతుంది.
పట్టుదలతో కృషి చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అదంతట అదే వస్తుంది
కాగా జోత్స్న (Jyotsna) మెడిసిన్ మొదటిసంవత్సరం ఫెయిల కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఆత్మహత్య చేసుకుంది. చదువులో వెనుకబడడం సహజమే. కానీఅందుకు పట్టుదలతో కృషి చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అదంతట అదే వస్తుంది. మీపై ఆధారపడి, ఎన్నో ఆశలు ఎట్టుకుని జీవిస్తున్నకన్నవారికి, కుటుంబ సభ్యులను దుఖసాగరంలో పడేసి ఆత్మహత్యకు పాల్పడడం మంచి చర్యకాదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: