📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest news: AP Crime: బాలిక పై టీడీపీ నేత అత్యాచారం..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

Author Icon By Saritha
Updated: October 22, 2025 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తునిలో టీడీపీ నేత అరాచకంగా ప్రవర్తించిన ఘటన

కాకినాడ జిల్లా: జగన్నాథగిరిలోని గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్నం (AP Crime) ఘటన తుని ప్రాంతాన్ని కుదిపేసింది. టీడీపీకి (TDP) చెందిన తాటిక నారాయణరావు అనే నేత, తాను తాతయ్య వరుస అవుతానంటూ మాయ మాటలు చెప్పి, 8వ తరగతి చదువుతున్న బాలికను స్కూటర్‌పై స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. నిర్మానుష ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడతుండగా, ఈ దృశ్యాలను ఓ స్థానికుడు గమనించి వీడియో తీశాడు.

అతనిని నిలదీసినప్పుడు బాలిక దుస్తులు వేసుకుంటుండగా కనిపించింది. నారాయణరావు ప్రశ్నల్ని ఏడిపించి, బాలికను బైక్‌పై ఎక్కించుకుని అక్కడినుంచి పరారయ్యాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read also: స్థానిక ఎన్నికల్లో పిల్లల పరిమితి రద్దు:  సీఎం సంతకం

Crime: బాలిక పై అత్యాచారం..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

గ్రామస్థుల ఆగ్రహం – నిందితుడిపై బడితపూజ

దర్యాప్తులో నారాయణరావు ఇప్పటికే 4–5సార్లు బాలికను స్కూల్ హాస్టల్ నుంచి తన బంధువులమంటూ బయటకు తీసుకెళ్లినట్టు వెల్లడైంది. హాస్టల్ సిబ్బంది, బాలిక తల్లిదండ్రులపై పోలీసులు (AP Crime) విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై బాలిక కుటుంబసభ్యులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. కేసును రాజకీయ కోణంలో మలుపు తిప్పే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ, రూరల్ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు.

కేసును ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ దారుణ ఘటన తెలుసుకున్న గ్రామస్థులు నిందితుడు తాటిక నారాయణరావును పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుడిపై చర్యలు తీసుకుని బాధిత బాలికకు తక్షణం న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

https://twitter.com/i/status/1980866714171810273

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Andhra Pradesh crime news Girl Child Abuse Justice for Girl Kakinada news Latest News in Telugu minor girl assault TDP Leader Crime Telugu News Tuni Incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.