సోమవారం, ఆంధ్రప్రదేశ్ (AP Crime) లోని, కడియం రైల్వే స్టేషన్ యార్డ్ సమీపంలో గుర్తు తెలియని 45 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైలు ఢీకొట్టడం వల్ల మృతి చెంది ఉండవచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నల్లని చొక్కా, సిమెంటు రంగు నిక్కరు ధరించి ఉన్నాడని, ఎడమ చేతి చూపుడు వేలు సగం వరకు లేదని తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read Also: Kakinada Bus Accident: బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: