చింతూరు : చింతూరు మన్యంలో జరిగిన ఒక హృదయ విదారక ఘటన చూపరులను సైతం కన్నీళ్ళు పెట్టించేలా ఉంది. చింతూరు మండలం ఇర్కంపేట (వలస ఆదివాసి గ్రామం) గ్రామానికి చెందిన మడకం పోసయ్య(45) అనే గిరిజనుడు మద్యం మత్తులో మతి స్థిమితం కోల్పోయి ఇంట్లో భార్య వండిన ఆనపకాయ కూరలో పిట్టల మందు కలిపి తాను తిని అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మతి స్థిమితం లేని వ్యక్తి మద్యం మత్తులో చేసిన పోరపాటుతో ఆ కుటుంబం మొత్తం ఆసుపత్రిపాలు అయ్యింది. మడకం పోసయ్య చింతూరు మండలం ఇర్కంపేట గ్రామములో నివసిస్తున్నాడు. అతనికి ఆరుగురు సంతానం. అందులో ఐదుగురు ఆడపిల్లలే. సోమవారం ఉదయం పోసయ్య భార్య హడమమ్మ, పెద్ద కూతురు లక్ష్మి కూలీ పనులకు వెళ్తూ ఇంటి వద్ద ఆనపకాయ కూర, అన్నం వండి ఇంట్లో ఉంచి వెళ్లారు.
Read also: CM Chandrababu: నేడు ఏపీ కేబినెట్ సమావేశం
man lost his mental balance under the influence of alcohol
కూరలో విషం కలిపినట్టు ఆమె గుర్తించలేదు.
మధ్యాహ్నం మద్యం మత్తులో కూరలో పిట్టల మందు కలిపి తిన్న సోమయ్య ఇంట్లో ఓ మూలన పడుకున్నాడు. సాయంత్రం కూలీ పనుల నుంచి వచ్చిన భార్య, కూతురు పోసయ్య పరిస్థితి గమనించి ఏడుగు రాళ్ళపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పోసయ్య మృతిచెందాడు. పోసయ్యకు ఏమైందో తెలియని ఆ కుటుంబలోని ఐదుగురు చిన్నారులను ఇంటి వద్ద ఒంటరిగా వదలేక, పోసయ్యకు అక్క అయిన ముచ్చిక ఐతమ్మ, ఆమె కూతురు లక్ష్మిని ఇంటి వద్ద వదిలేసి వెళ్ళారు. రాత్రి కావటంతో పిల్లలు ఆకలి అనటంతో ఐతమ్మ అన్నం వండి ఇంట్లో ఉన్న కూరను పిల్లలకు పెట్టింది. తాను కూడా తిన్నది. కాని కూరలో విషం కలిపినట్టు ఆమె గుర్తించలేదు. అయితె పోసయ్య కుమారుడు వయస్సు రెండు సంవత్సరాలు అన్నం తినటానికి నిరాకరించాడు. దాంతో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
మరో వైపు అరుగురి పరిస్థితి విషమం
అయితే రాత్రి కావటంతో ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకున్నారు. పిల్లలు, ఐతమ్మ అందరికి వాంతులు, విరేచనాలు కావటంతో ఎదో జరిగింది అని ఊహించిన ఐతమ్మ చింతపండు రసం తీసి అందరికి తాగించింది. రాత్రి 10గం: ప్రాంతంలో మృతదేహంతో ఇంటికి చేరిన హడమమ్మ, ఆమె కూతురు, బందువులు ఇంట్లో ఉన్న అందరు చిన్నారులు, ఐతమ్మ పరిస్థితి చూసి తల్లడిల్లి పోయారు. ఒక వైపు శవం, మరో వైపు అరుగురి పరిస్థితి విషమం. కారుచీకటి, కమ్మూనికేషన్ లేని గ్రామం . అలాగే తెల్లవారే వరకు గడిపి మంగళవారం ఉదయం ఏడుగు రాళ్ళపల్లి ఆసుపత్రికి తరలించగా ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐదుగురు చిన్నారులు, మృతుడి అక్క పరిస్థితి నిలకడగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకోని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద మృతుడి భార్య, కుమార్తెతో పాటు బందువులు, గ్రామస్తులు ఆసుపత్రి ముందు కూర్చోని అమాయకంగా చూస్తున్న దృశ్యం చూరులను సైతం కంట తడిపెట్టించేలా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: