📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP Council Elections: ఏపి వైద్య మండలికి 13 మంది సభ్యులు ఎన్నిక

Author Icon By Tejaswini Y
Updated: February 11, 2026 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Council Elections : ఏపీ వైద్య మండలి(ఏపీ మెడికల్ కౌన్సిల్) కి ఎన్నికైన 13 మంది సభ్యుల ఆన్లైన్ ఫలితాల్ని విడుదల చేసారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ సమక్షంలో రిటర్నింగ్ అధికారి, డైరెక్టర్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు మంగళవారం తన కార్యాలయంలో రిజల్ట్స్ విడుదల చేశారు. 10,293 కోట్లతో కోల అలేఖ్య ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా బొల్ల మోనిక 10,189 ఓట్లతో ద్వితీయ స్థానంలో, మనీష్ మండల 10,123 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. మంతిని వినోద్ కుమార్ కు 9,857 ఓట్లు, అరవ వెంకట సుబ్బారెడ్డికి 9,174, ఓ. శివమోర్య గుప్తకు 8,884, వెంకటరమణకు 8,632, మెట్ల జయచంద్రారెడ్డికి 8,494, బోలెం తేజీ నవీన్ కు 7,820, గార్లపాటి నంద కిషోర్ కు 7,705 శ్రీహరి కరువకు 7,553, కార్తీక్ తుమ్మలకు 7,154 ఓట్లు లభించాయి ఎన్నికల్లో విజయం సాధించిన వారికి ఆయన దృవీకరణ అందజేశారు.

Read also: R. D. Wilson Sarath Chandra: తెలుగు అకాడమీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ

AP Council Elections: 13 members elected to AP Medical Council

చక్రధరబాబు మాట్లాడుతూ

ఈ సందర్భంగా చక్రధరబాబు మాట్లాడుతూ మొత్తం 56,156కు గాను 30,773 మంది (55 ) వైద్యులు “ఈ ఓటింగ్” ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం శుభపరిణామన్నారు. ఎపిఎంసిలో 13 సభ్యుల స్థానాలకు 84 మంది వైద్యులు పోటీపడారన్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఈ ఎన్నికలు జరిగాయన్నారు. ఒక్కొక్కరు 13 ఓట్లు వేసేందుకు అవకాశం ఉండగా, మొత్తం 3,15,745 ఓట్లు పోలయ్యాయని. క్యుములేటివ్గా ఎవరికైతే అధికశాతం ఓట్లు వచ్చాయో వారు సభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. ప్రజా స్వామ్యబద్ధంగా పారదర్శకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించామన్నారు.

వైద్యుల్లో మంచి స్పందన

అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఎన్నికల ప్రక్రియను సమర్ధవంతగా నిర్వహించామని, ఓటర్లకు హెల్ప్ లైన్ ద్వారా రియల్ టైం విధానంలో సహాయ సహకారాల్ని అందించామన్నారు. అలాగే ఎపిఎంసి చునావ్ బాట్ అనే చాట్ బాట్ ను చాలా మంది వైద్యులు వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. మొత్తమ్మీద ఓటర్లుగా నమోదు, ఈ ఓటింగ్ విధానం పట్ల వైద్యుల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. వారి వారి ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో బిజీ షెడ్యూల్స్ లో చాలా మంది దేశ విదేశాల్లో ఉన్నా కూడా ఎపిఎంసి లో ఓటు వేసేందుకు పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించి సమర్ధవంతంగా పనిచేసినందుకు ఎపిఎంసి రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ ను, రాత్రి పగలు పనిచేసిన ఎన్ఐఐసి, ఏపీఆన్లైన్ సిబ్బందిని ఆయన అభినందించారు.

ఎన్నికైన అభ్యర్థులు 13 మంది ఈ కౌన్సిల్ లో ఉంటారని, మరికొంతమందిని నామినేటెడ్ (Nominated) సభ్యుల్ని కూడా ప్రభుత్వం తరపున నియామకం జరుగుందని, మొత్తం 25 మంది సభ్యులతో ఎపిఎంసి సేవలందిస్తుందని చక్రధరబాబు తెలిపారు. ఎంబిబిఎస్ చదివిన వారు, పీజీ డిప్లమా చేసిన వారు, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా ఎన్నికల్లో పాల్గొన్నారన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు ఎన్నికల్లో పాల్గొన్నారన్నారు. ఎన్నికైన సభ్యులు వారి వారి వృత్తిపరమైన అనుభవాన్ని మండలి దృష్టికి తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఎపిఎంసికి వన్నెతెస్తారనే నమ్మకం తనకుందని చక్రధరబాబు తెలిపారు. హైకోర్టు వారి ఆదేశాల మేరకు అత్యంత తక్కువ జవాబుదారితనంగా, పారదర్శకంగా ఎన్నికల్ని నిర్వహించామన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Medical Council AP Medical Council Elections APMC Election Results 2026 E-voting for Doctors

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.