ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో సివిల్, ఏపీఎస్‌పీ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శుభవార్త. ఈ నెల 22వ తేదీ నుంచి అధికారికంగా పోలీస్ శిక్షణ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. (AP) రాష్ట్రంలోని 21 పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, బెటాలియన్‌లలో ఈ శిక్షణ ఇవ్వబడుతుంది. అభ్యర్థులు 21వ తేదీన తమకు కేటాయించిన శిక్షణ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు వీరికి నియామక పత్రాలు అందజేేశారు.
Read Also: AP: రాష్ట్ర వ్యాప్తంగా రేపే పల్స్ పోలియో!

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: