📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

AP: రారండోయ్.. సిరిమాను జాతర చూద్దాం

Author Icon By Saritha
Updated: January 27, 2026 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ అలంకరణ

మక్కువ (పార్వతీపురం మన్యం జిల్లా) : సంబర పోలమాంబ (Sambara Polamamba) జాతరకు సర్వం సిద్ధమైంది. (AP) జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వాహక అధికారి బి.శ్రీనివాసరావు ఏర్పాట్లను చేశారు. భక్తులు దర్శనార్థం క్యూలైన్లను ఏర్పాటు చేసి 20, 50, 100తో పాటు ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేశారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. క్యూలైన్లో ఉన్న చిన్న పిల్లలకు పాలు ఏర్పాటు చేశారు. చదురుకుడి వనం గుడి వద్ద ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నైదాన చిన తిరుపతిరావు ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణగా నిలిచింది.

Read Also: AP: మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రకు మూడేళ్లు

900 మందితో బందోబస్తు

(AP) సంబర పోలమాంబ జాతరలో 900 మందితో పటిష్ట బందోబస్తు పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. సోమవారం సాయంత్రం అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, ఎఎసిపి మనీషా రెడ్డి డిఎస్పి రాంబాబులు సిబ్బందికి దిశా నిర్దేశాలు చేశారు. డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశామని అక్కడ అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. భక్తులు ఉన్న ప్రదేశం నుండి ఎక్కడికి వెళ్లాలన్న మ్యాపింగ్ తో ఉన్న ఫ్లెక్సీలను ప్రతి కూడలిలో ఉంచామన్నారు.

రసీదులపై ఆరా, ముగిసిన తొలి ఏళ్ల ఉత్సవం

జిల్లా సబ్ కలెక్టర్లు ఆర్ వైశాలి, స్వప్నిల్ పవర్ లు అంగడులు ఏర్పాటు చేసిన వారు పంచాయతీ సిబ్బంది వద్ద రసీదులు తీసుకున్నారా లేదా అనే దానిపై ఆరా తీశారు. దుకాణాల వద్ద చెత్త డబ్బాలు తప్పనిసరిగా ఉండాలని లేకపోతే అపరాధ రుసుములు తప్పవని హెచ్చరించారు.

సోమవారం రాత్రి తొలి ఏళ్ల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు తొలి ఏళ్ల ఉత్సవంలో వాడిన ధాన్యాన్ని తన ధాన్యపురాశులలో కలుపుకొని ఉంచుకోవడం ఇక్కడ ప్రజల విశ్వాసం. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు సిరిమాను జన్ని పేకాపు జగదీశ్వరరావు అధిరోహించనున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Drone Surveillance Latest News in Telugu Parvathipuram Manyam Police Bandobast Sambara Polamamba Sirimanam Jatara Telugu News Temple Festival

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.