📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP Colleges – ఏపీలో ఈ నెల 22 నుంచి కాలేజీలు బంద్.. ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: September 19, 2025 • 8:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు (Private degree colleges) ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఇప్పటికే పలుమార్లు వినతులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని యాజమాన్యాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. లేని పక్షంలో ఈ నెల 22 నుంచి కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వానికి సమర్పించాల్సిన బోధన రుసుములు (ట్యూషన్ ఫీజులు) ఇంకా చెల్లింపులు జరగకపోవడంతో కళాశాలలు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెబుతున్నాయి.

ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రకటన ప్రకారం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fee reimbursement) కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, దీనివల్ల సిబ్బంది జీతాలు చెల్లించడం, కళాశాలల నిర్వహణ ఖర్చులు తీర్చడం కష్టమైపోయిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో తాము బోధన కొనసాగించడం చాలా కష్టమని, తక్షణమే రుసుములు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇప్పటివరకు సహనంగా ఉన్నామని

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ (Chairman of the Council of Higher Education) కి ఈ సమస్యపై సంఘం వినతిపత్రం సమర్పించింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇప్పటివరకు సహనంగా ఉన్నామని, కానీ ఇకపై ఆర్థిక ఇబ్బందులు భరించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలు నడిపేందుకు కనీస అవసరాలకైనా నిధులు లేకపోవడంతో పరిస్థితి అత్యవసర దశకు చేరుకుందని తెలిపారు.

AP Colleges

అలాగే యూనివర్శిటీలలో ఫీజులు కట్టకపోతే పనులు జరగడం లేదని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం విద్యార్థుల రుసుములు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని.. కనీస అవసరాలు తీర్చలేకపోతున్నామన్నారు.

గతవారం యాజమాన్యాలు కాలేజీలను మూసివేయాలని

ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబరు మొదటి వారంలో నిరవధిక సమ్మె చేస్తామని కూడా హెచ్చరించారు. ఈ మేరకు నిరవధిక సమ్మెలోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ప్రభుత్వం రుసుములు చెల్లించాలని కాలేజీల్ల చదివే విద్యార్థుల ద్వారా వినతులు పంపిస్తామన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని కోరారు. ఇటీవల తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.. దీంతో గతవారం యాజమాన్యాలు కాలేజీలను మూసివేయాలని నిర్ణయించారు. ఇంతలో ప్రభుత్వం వారితో చర్చించడంతో సమస్య పరిష్కారం అయ్యింది.. వెంటనే బంద్‌ను కూడా ఉపసంహరించుకున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఈ ఫీజుల అంశాన్ని ఎలా డీల్ చేస్తుందన్నది చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/srisailam-hundi-calculation/andhra-pradesh/549990/

Andhra Pradesh Breaking News college closure threat fee reimbursement issues immediate payment demand latest news private degree colleges Telugu News tuition fees

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.