📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : AP CM – ప్రతి నిత్యం కొత్తగా ఆలోచనలు ఇదే నా సక్సెస్ ఫార్ములా – చంద్రబాబు

Author Icon By Shravan
Updated: September 3, 2025 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ AP CM : ప్రతి నిత్యం కొత్తగా ఆలోచనలు ఇదే నా సక్సెస్ ఫార్ములా – చంద్రబాబు : ప్రతినిత్యం కొత్తగా ఆలోచనలు చేయాలనేది తన విధానమని… ఇదే తన సక్సెస్ ఫార్ములా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) వెల్లడించారు. సోమవారం రాజంపేట పర్యటన ముగించుకుని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబును మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు కలిశారు. సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తి కావడంతో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వారితో కాసేపు భేటీ అయ్యారు. 30 ఏళ్ల కాలంలో నాలుగు సార్లు సీఎంగా తాను తీసుకున్న నిర్ణయాలు… పాలనా అంశాలు, అమలు చేసిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలపై అనుభవాలను చంద్రబాబు పంచుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.

చంద్రబాబు: సంస్కరణల ధైర్యంతోనే విజయాలు సాధ్యమయ్యాయి!

ఆ స్పూర్తితో భవిష్యత్ కు ప్రణాళికలు రచించాలి. గతంలో సక్సెస్ అయిన పాలసీలను స్టడీ చేయాలి… నేటి అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలి, అధికారులైనా, ప్రజా ప్రతినిధులు అయినా ఒక తపనతో పని చేస్తేనే ఫలితాలు వస్తాయి. కొత్తగా ఆలోచిస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. నా రాజకీయ జీవితంలో ఆదొక విధానంగా పెట్టుకున్నా. ఇదే నా విజయ రహస్యం. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు అనేక సవాళ్లు వచ్చాయి. వాటిని ఎదుర్కోని ధృఢ నిర్ణయాలతో పాలన సాగించాం. ఆటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రాంతంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. విద్యా రంగంలో అనేక మార్పులు తెచ్చాం. రంగారెడ్డి జిల్లాలో 10 హైస్కూళ్లు కూడా ఉండేవి కాదు. అలాంటి చోట 240 ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చాం. నాడు రంగారెడ్డి అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉండేది.

అలాంటి జిల్లా అనంతర కాలంలో రిచ్చెస్ట్ ప్రాంతంగా మారింది. సంస్కరణలకు భయపడితే సంక్షేమం అందించలేం అప్పుడు… ఇప్పుడు…. ఎప్పుడూ లా అండ్ ఆర్డరే టాప్ ప్రయార్టీ గతాన్ని గుర్తుంచుకోవాలి భవిష్యత్తుకు ప్రణాళికలు వేయాలి 30 యేళ్ల అనుభవాలను పంచుకున్న చంద్రబాబు జాతీయ స్థాయిలో పాలసీల్లో ఆలోచనలు పంచుకోవడం గర్వకారణంనాడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బూముల 3 కంపెనీలు ముం దుకు వచ్చేవి కావు. తరువాత వారిని ఒప్పించి మోళిక సదుపాయాలు. కల్పించి సంస్థలను ఏర్పాటు చేశాం. హైటెక్స్, నాక్ సంస్థలు తెచ్చాం.. నాడు తెచ్చిన హైటెక్స్ వంటి దేశంలోనే పెద్ద కన్వెన్షన్ సెంటర్ గా నిలిచింది.” అని చంద్రబాబు చెప్పా రు. కొన్ని నిర్ణయాలను ఉద్యోగ, కార్మిక సంఘాలు వ్యతిరేకించేవి. ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే… భయపడేవాడిని కాదు.

సంస్కరణలు, శాంతిభద్రతలతో రాష్ట్రానికి మార్పు!

విమర్శలకు భయపడి సంస్కరణలకు దూరంగా ఉండకూడదు. భయపడితే అక్కడే ఆగిపోతాం… ప్రజలకూ మంచి చేయలేం. సంస్కరణలు అనుకుంటే ఆమలు చేసేసేవాళ్లం. ప్రజల మంచి కోసం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే… దేనికీ ఆలోచించే వాళ్లం కాదు. మొదట్లో విమర్శించిన వాళ్లే… ఆ తర్వాత కాలంలో ఆ నిర్ణయాలు… ఆ సంస్కరణల్లో విషయముందని మెచ్చుకున్నారు. శాంతి భద్రతల విషయంలో అత్యంత కఠినంగా ఉండేవాడిని. నాడు సీమలోగాని, హైదరాబాద్ సీటీలో మార్పు తెచ్చాం. తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం సమస్య తీవ్రంగా ఉండేది. నాయకులు ఊళ్ల ఉండలేక హైదరాబాద్ (Hyderabad) వచ్చేసేవాళ్లు, ఎప్పుడోగాని భద్రతతో గ్రామాలకు వెళ్లే వాళ్లు కాదు. అధికారుల్లో నైతిక స్థైర పెంచడానికి స్వయంగా నకల్స్ ప్రాంతానికి వెళ్లే వాడిని, దీం అధికారులు సాకులు చెప్పడం తగ్గించి ధైర్యంగా పని చేశారన్నారు. రాయలసీమలో విపరీతమైన ఫ్యాక్షన్ ఉండేది. ఇళ్లల్లో మహిళలు పిల్లలపైనా ఆ ఫ్యాక్షన్ ప్రభావం ఉండేది. హత్యకు హత్య ఆ విధంగా నాడు కొందరు ఉండేవాళ్లు. దాన్ని కంట్రోల్లో పెట్టా ఫ్యాక్షన్ అంతం చేశాం. హైదరాబాద్ నగరంలో మత కలహా కొనసాగితే పెట్టుబడులు రావని ఆలోచించాం.

AP CM – ప్రతి నిత్యం కొత్తగా ఆలోచనలు ఇదే నా సక్సెస్ ఫార్ములా – చంద్రబాబు

శాంతిభద్రతలతో పెట్టుబడులు, మహిళా శక్తికి ప్రాధాన్యం!

అందుకే ము ఘర్షణలపై ఆ వర్గం ఈ వర్గం అని లేకుండా చాలా కఠినం ఉన్నాం. సమర్థులైన అధికారులను చార్మినార్ సహా సున్నితమై ప్రాంతాల్లో విధుల్లో వేసేవాడిని.. ఫుల్ పవర్స్ ఇచ్చేవాడిని. దీం జంట నగరాల్లో మత కలహాలు తగ్గిపోయాయి. ఆ తర్వా పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు కూడా రాష్ట్రంలో శాం భద్రతలకే హై ప్రయార్టీ ఇస్తున్నాం.” అని సీఎం స్పష్టం చేశాడా ‘జాతీయ స్థాయిలో మంచి పేరున్న వాళ్లను, ప్రముఖులను తెల ప్రజల్లో చైతన్యం తెచ్చేవాళ్లం. వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ పడా వాళ్లను తీసుకువచ్చి ప్రచారం చేయించాం.
కార్యక్రమాలు చేపట్టాం. ఇంకుడు గుంతలు వంటి కార్యక్రమాలు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం.. ఇది ఎంతో మంచి ఫలితా ఇచ్చింది. అనంతరపురం జిల్లాలో 10 ఏళ్లలో 8 ఏళ్లు కరు ఉండేది. రైతులు నష్టపోయే వాళ్లు. దీంతో నాడు రైతులకు ఇను సబ్సిడీ పెట్టాం.. తొలిసారి ఈ విధానం తెచ్చింది మన వె మహిళా శక్తిని సమర్థంగా వినియోగించుకోవాలని గొప సంకల్పంతో పని చేశాం. నాడు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగా ఆడబిడ్డలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం.

చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో ముఖ్య విజయాలు ఏమిటి?
చంద్రబాబు నాయుడు సీఎంగా నాలుగు సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. హైటెక్ సిటీ, హైటెక్స్, ఐటీ రంగ అభివృద్ధి, సీమలో ఫ్యాక్షన్ అంతం, తెలంగాణలో నక్సలిజం తగ్గింపు, విద్యా రంగ సంస్కరణలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి పలు కీలక కార్యక్రమాలను అమలు చేశారు.

చంద్రబాబు పాలనలో ప్రధాన ప్రాధాన్యాలు ఏమిటి?
పాలనలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మహిళా సాధికారత, వ్యవసాయ సబ్సిడీలు, సామాజిక సంక్షేమం, విద్యా అవకాశాల పెంపు వంటి రంగాలలో సంస్కరణలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/logistics-aps-rapid-development-as-a-logistics-gateway-cm-chandrababu/andhra-pradesh/540458/

ap cm chandrababu AP News Breaking News in Telugu chandrababu speech Latest News in Telugu Leadership tips Political leaders inspiration Success formula Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.