📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Today News : AP CM – ఎరువుల అక్రమ విక్రయాలు, బ్లాక్ మార్కెటింగ్ పై ఉక్కుపాదం

Author Icon By Shravan
Updated: September 3, 2025 • 2:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ AP CM : ఎరువుల అక్రమ విక్రయాలు, బ్లాక్ మార్కెటింగ్పై ఉక్కుపాదం మోపాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయు (AP CM Chandrababu Naidu) ఆదేశించారు. రైతులకు ఎరువులకు లోటు ఉందనే మాట విన్పించకూడదన్నారు. ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు సీఎం చంద్రబాబు చేశారు. ఎరువుల లభ్యత, సరఫరా, ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలకుండా కఠినంగా వ్యవహారించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈసారి రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు ఏపీకి వచ్చాయని తెలిపారు అధికారులు.

పంటల పర్యవేక్షణ మరియు సబ్సిడీలు

ఈ క్రాప్ ద్వారా ఎంత సాగవుతుంది.. ఎంత వినియోగం జరుగుతుందో లెక్కించాలని సూచించారు. వంటల సాగు, సరఫరా, లభ్యత, వినియోగంపై నిరంతరం పర్యవేక్షించాలని మార్గనిర్దేశం సీఎం చంద్రబాబు చేశారు. ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు పలు రకాల సబ్సిడీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉద్యాన పంటలకు ఆయా వంటల సాగు ఖర్చుల ప్రకారం అన్నదాతలకు మద్దతు ధర దక్కేలా చూడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన తెగుళ్లపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం. కొత్త తెగులు వచ్చిన కాఫీ పంట 20 ఎకరాల్లో ఉందని… వీటిని తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలకు తెగుళ్లు వ్యాపించకుండా పరిహారం చెల్లించి అయినా తెగులు వచ్చిన పంటను వెంటనే తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

AP CM – ఎరువుల అక్రమ విక్రయాలు, బ్లాక్ మార్కెటింగ్ పై ఉక్కుపాదం

విజిలెన్స్ తనిఖీలు మరియు కేసులు

ఎరువుల లభ్యత, సరఫరా, పక్కదారి పట్టకుండా తీసుకుంటున్న చర్యలపై కచ్చితమైన కార్యచరణ అవసరమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల అక్రమ విక్రయాలు జరగకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల విజిలెన్స్ బృందాలు దాడులు చేశాయి. గతవారం రోజులుగా నిర్వహించిన సోదాల్లో పెద్దఎత్తున ఎరువుల అక్రమ నిల్వలు బయటపడ్డాయి. అలాగే బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి కొందరు డీలర్లు అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నట్టు దాడుల్లో వెల్లడి అయింది. ఆగస్ట్ 23 నుంచి ఆగస్ట్ 31 వరకు మొత్తం 286 విజిలెన్స్ బృందాలు 598 దుకాణాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా అక్రమంగా విక్రయిస్తున్న రూ.1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్ టన్నుల ఎరువులు సీజ్ చేశారు. వారిపై 67 కేసులు (Cases) నమోదు చేశారు.

రాష్ట్రంలో ఎరువుల అక్రమ విక్రయాలు నివారించడానికి ఏ చర్యలు చేపట్టారు?
రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ బృందాలు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన ఎరువులను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు.

రైతులకు ఎలాంటి మద్దతు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు?
పురుగు మందులు మరియు ఎరువుల వినియోగం తగ్గించిన రైతులకు సబ్సిడీలు ఇవ్వడం, ఉద్యాన పంటలకు సాగు ఖర్చుల ప్రకారం మద్దతు ధర అందించడం వంటి చర్యలను పరిశీలించాలని సూచించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/meet-jin-kim-putin-on-the-same-stage-trumps-anger-is-not-normal/international/540593/

agriculture Andhra Pradesh AP Government Black Marketing Breaking News in Telugu Chandrababu Naidu Farmers Fertilizer Scam Fertilizers Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.