AP: తిరుపతిలో రూ.6.41 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభానికి ముందు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి గారు లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్యులు శ్రీ సత్య అనగాని గారు, డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు, తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ గారు, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు (Subbarayudu) గారు, పలువురు ప్రజాప్రతినిధులు మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పోలీస్ శాఖను మరింత పటిష్టం చేయడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ, పోలీసులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి.
ఈ నూతన భవనంలో:
- గ్రౌండ్ ఫ్లోర్: ఎస్పీ కార్యాలయం, ఆడిటోరియం, వెయిటింగ్ హాల్
- ఫస్ట్ ఫ్లోర్: అడిషనల్ ఎస్పీ కార్యాలయం
- సెకండ్ ఫ్లోర్: DCRB, ఐటీ కోర్ టీమ్ కార్యాలయాలు, మినీ కాన్ఫరెన్స్ హాల్
ఈ భవనం పోలీస్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా చేయడానికి రూపకల్పన చేయబడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: