📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: హెలిప్యాడ్ భూమిపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

Author Icon By Saritha
Updated: February 9, 2026 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఇంటి పక్కన ఉన్న భూమిని హెలిప్యాడ్ కోసం బలవంతంగా లాక్కున్నారని హెలిప్యాడ్ కోసం భూమిని ఇవ్వకపోతే దాన్ని 22-Aలో పెట్టారని, బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. చట్టాలు చేయాల్సిన వ్యక్తి, చట్టాలు అమలు చేయాల్సిన వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి భూమిని చట్టవిరుద్ధంగా 22-Aలో పెట్టడం దారుణమని అన్నారు. 

Read Also: Chandrababu Naidu: ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి

గత పాలకుల దుర్మార్గాల గురించి ఆలోచించాలని సూచన

(AP) ఐదేళ్లు అవుతున్నా విముక్తి లేదని చంద్రబాబు చెప్పారు. దీనికి సంబంధించి ఆయన మొన్న అన్ని వివరాలు ఇచ్చారని తెలిపారు. భూములపై గత పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు అనే దానిపై అందరూ ఆలోచించుకోవాలని చెప్పారు. రెవెన్యూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని సీఎం తెలిపారు.

రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను ఇస్తున్నామని చెప్పారు. క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లతో పాసు పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. భూ వివాదాలు లేకుండా సర్వే ప్రక్రియలను పకడ్బందీగా చేపడుతున్నామని చెప్పారు. రాజధాని అమరావతిని కంప్యూటింగ్ కేంద్రంగా మారుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. విశాఖలో గూగుల్ తో పాటు పలు సంస్థలు డేటా సెంట్లర్లను ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పారు. మొత్తం 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు రాబోతున్నాయని చెప్పారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

22-A Land Issue AP Ministers Meeting Chandrababu Comments Helipad Land Controversy Latest News in Telugu Telugu News YS Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.