📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

News Telugu: AP: నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

Author Icon By Rajitha
Updated: December 15, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాయంత్రం విజయవాడలో అమరజీవి ఆత్మార్షణ దినం కార్యక్రమానికి సిఎం హాజరు

విజయవాడ : హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) రేపు సందర్శించనున్నారు. రేపు ఉదయం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్న సిఎం 11 గంటలకు కన్హా శాంతివనం చేరుకోనున్నారు. ఆశ్రమం అధ్యక్షులు కమలేష్ డి. పటేల్ దాజీతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రెండు గంటల పాటు శాంతివనంలోని వెల్నెస్, మెడిటేషన్ సెంటర్ సహా, యోగా కేంద్రాలను ముఖ్యమంత్రి తిలకించనున్నారు. ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రం, మెడిటేషన్ సెంటర్, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపీచంద్ స్టేడియంతో పాటు హార్టిఫుల్ నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ను సిఎం సందర్శిస్తారు. అనంతరం శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి వెళ్లనున్నారు.

Read also: AP: స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

CM Chandrababu will visit Kanha Shanti Vanam

8 లక్షలకు పైగా వివిధ జాతుల వృక్షాలతో

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మొత్తం 1400 ఎకరాల్లో కన్హా శాంతి వనాన్ని శ్రీరామచంద్ర మిషన్ అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ను ఈ ఆశ్రమం కలిగి ఉంది. 8 లక్షలకు పైగా వివిధ జాతుల వృక్షాలతో బయోడైవర్సిటీ కేంద్రంగా ఈ ఆశ్రమం పెద్ద ఎత్తున పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. మానవ వనరుల్ని గ్లోబల్ లీడర్లుగా తయారు చేసేందుకు ఈ ఆశ్రమం అధ్యక్షులు దాజీ నేతృత్వంలో హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఈ ఆశ్రమం నిర్వహిస్తోంది. కౌశలం పేరిట శిక్షణా కార్యక్రమాలను చేపడుతోంది. కన్హా శాంతివనంలోని యోగా, మెడిటేషన్, వెల్ నెస్ సెంటర్లతో పాటు సుస్థిర వ్యవసాయ క్షేత్రాన్నిను కూడా ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. అనంతరం ఆయన హెలికాప్టర్లో బయల్దేరి అమరావతికి తిరిగి రానున్నారు. మద్యాహ్నం సచివాలయంలో అధికారులతో వేర్వేరు సమీక్షల్లో పాల్గొనున్నారు. రేపు సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమానికి హాజరు కానున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chandrababu Naidu Visit Kanha Shanti Vanam Ashram latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.