📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

AP: రేపు మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు భేటీ

Author Icon By Aanusha
Updated: January 11, 2026 • 6:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నాడు మంత్రులు, శాఖల కార్యదర్శులతో సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు కూడా వర్చువల్ విధానంలో హాజరు కానున్నారు.సమావేశం ప్రారంభంలో, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ), 2047 విజన్‌లోని 10 సూత్రాలపై అధికారులు ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

Read also: Sankranthi : విజయవాడ వైపు 60-70వేల వాహనాలు!

కీలక అంశాలపై సీఎం సమీక్ష

అనంతరం ఆదాయార్జన మార్గాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల పురోగతి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆకర్షణ, ఫైళ్ల పరిష్కారం, ఆన్‌లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై సీఎం సమీక్ష జరుపుతారు.ముఖ్యంగా రెవెన్యూ శాఖ పనితీరుపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, భూముల సర్వే, రిజిస్ట్రేషన్ సేవలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై మంత్రులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

AP: CM Chandrababu will meet with ministers and secretaries tomorrow

బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ప్రజల ఆస్తులకు పటిష్ఠ భద్రత కల్పించే విధానంపైనా చర్చిస్తారు. వీటితో పాటు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ పథకంపై కూడా సమీక్షించనున్నారు. సమావేశం ముగిసిన అనంతరం, సాయంత్రం సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగ కోసం తన స్వగ్రామం నారావారిపల్లెకు బయలుదేరి వెళతారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh Government Chandrababu Naidu latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.