📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

AP: పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై సీఎం చంద్రబాబు సమీక్ష

Author Icon By Saritha
Updated: January 27, 2026 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన నిర్మాణాలను పునరుద్ధరించాలని (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) అధికారులను ఆదేశించారు.

రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో 10 జిల్లాలను ఉద్యాన కేంద్రాలుగా మార్చే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు

Read Also: AP: వాయిదా పడిన పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన

20కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశం

గత ప్రభుత్వం(AP) సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, అనేక ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టిందని ఈ సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, 10 జిల్లాల పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. తక్కువ నిధులతో త్వరగా పూర్తయ్యే వాటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గాలేరు-నగరి ద్వారా కృష్ణా జలాలను కడప వరకు తీసుకెళ్లే అంశంపై దృష్టి సారించాలన్నారు. మొత్తంగా 20కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు, మరో 4.30 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీరందించవచ్చని అధికారులు సీఎంకు వివరించారు.

ప్రపంచస్థాయి ఉద్యాన హబ్‌గా రాయలసీమ 

ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు పెరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గ్లోబల్ డిమాండ్‌కు అనుగుణంగా 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో ఉద్యాన క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించగా, మూడేళ్లలో సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డీపీ వరల్డ్ ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని సీఎం వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లాజిస్టిక్స్, మార్కెట్, కోల్డ్ చైన్ వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

10 జిల్లాల్లో ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల వివరాలు:

వెలిగొండ ప్రాజెక్ట్, కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, పాలేరు రిజర్వాయర్, మల్లెమడుగు లిఫ్ట్-రిజర్వాయర్, శ్రీ బాలాజీ రిజర్వాయర్, కుప్పం బ్రాంచ్ కెనాల్, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, మూలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, హంద్రీ-నీవా ప్రధాన కాల్వ పనులు, అట్లూరుపాడు-మేర్లపాక ఎస్ఎస్ఎల్సీ, నీవా బ్రాంచ్ కెనాల్ పనులు, జీడిపల్లి-భైరవానితిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, జీడిపల్లి-అప్పర్ పెన్నార్ ఎత్తిపోతలు, అనంతలో కమ్యూనిటీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్,మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులు,పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం,కడప, కోడూరు వరకు గాలేరు-నగరి సుజల స్రవంతి, అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్దరణ పనులు,పశ్చిమ కర్నూలుకు నీళ్లిచ్చేలా వేదవతి-అలగనూరు-గాజులదిన్నె ప్రాజెక్టులు, ఏడు జిల్లాల్లో 1,011 మైనర్ ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి పై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:








Andhra Pradesh Government Chandrababu Naidu Horticulture Clusters irrigation projects Latest News in Telugu pending projects Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.