📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

News Telugu: AP: పత్తి, మొక్కజొన్న రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Author Icon By Rajitha
Updated: November 23, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సమకాలీన పరిస్థితుల్లో అరటి, పత్తి, (cotton) మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ధరలు పడిపోవడం, కొనుగోళ్లలో ఆలస్యం, మార్కెట్‌లో అనిశ్చితి వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఎక్కడా నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read also: Nandyal Road Accident : నంద్యాల జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం..ఇద్దరు మృతి

CM Chandrababu reviews issues of cotton and corn farmers

రాయలసీమ అరటికి రైల్వే వ్యాగన్ల సదుపాయం

రాయలసీమలో వేలాది హెక్టార్లలో పండుతున్న అరటికి ప్రస్తుతం సరైన ధర లభించకపోవడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబరు ప్రారంభంలో ధరలు మెరుగుపడే అవకాశం ఉన్నందున అప్పటి వరకు రైతులు నష్టపోకుండా చూసేందుకు అరటిని ముంబై, కలకత్తా వంటి పెద్ద మార్కెట్లకు రైల్వే వ్యాగన్ల ద్వారా తరలించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఒక ప్రైవేటు ఏజెన్సీ ముందుకు వచ్చిందని అధికారులు చెప్పగా, రవాణా కార్యక్రమాన్ని సమగ్రంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. మార్కెట్ ధరలపై ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖలకు బాధ్యతలు అప్పగించారు.

మొక్కజొన్న మరియు పత్తి రైతులకు రక్షణ చర్యలు

మద్దతు ధరల కంటే తక్కువకు మొక్కజొన్న అమ్ముతున్న రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి నుంచి వ్యత్యాసాన్ని భర్తీ చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం నాయుడు చెప్పారు. ఈ సీజన్‌లో 8.18 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉండగా, అందులో 2.04 లక్షల మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు రావొద్దని ఇతర ఏజెన్సీలతో ప్రయోగాత్మకంగా కొనుగోళ్లు చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పత్తి కొనుగోళ్లలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. భారీ వర్షాలు నమోదవుతుండటంతో సకాలంలో కొనుగోళ్లు జరగాలని ఆదేశించారు. ముఖ్యంగా తడిచిన లేదా రంగుమారిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

AP Farmers Chandrababu Naidu latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.