📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

AP: సీఎం చంద్రబాబుకు అవార్డు.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

Author Icon By Saritha
Updated: December 18, 2025 • 5:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) రాష్ట్రంలో చేపడుతున్న వ్యాపార సంస్కరణలకు జాతీయ స్ధాయిలో గుర్తింపు లభించింది. ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఆయన్ను(AP) “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్”గా ఎంపిక చేసింది. రాష్ట్రానికి పెట్టుబడుల్ని రప్పించడంలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు, ఆ మేరకు గూగుల్ వంటి సంస్దలు పెట్టుబడులు పెడుతున్న తీరు, ఇలా పలు అంశాలకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం ప్రకటించింది.

Read also: AP: అల్లూరి హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై లోకేశ్ ఆదేశాలు

చంద్రబాబుకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు

చంద్రబాబుకు(AP) అవార్డు లభించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.చంద్రబాబును ఒక దార్శనిక నేతగా పవన్ కల్యాణ్ అభివర్ణించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, ఐటీ, గ్రీన్ ఎనర్జీ రంగాలను ప్రోత్సహించడం, పాలనలో సంస్కరణలు తీసుకురావడంలో ఆయన చూపిన చొరవ, కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఆయన చేపట్టిన కార్యక్రమాలు ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్య సాధనకు మార్గం సుగమం చేస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషికి మరింత శక్తి చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తన సందేశంలో తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh AP cm Business Reformer of the Year Deputy CM Economic Times award Latest News in Telugu Nara Chandrababu Naidu Pawan Kalyan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.