ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో, స్వగ్రామంలో మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నారావారిపల్లె, తిరుపతిలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.అనంతరం నారావారిపల్లె లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.మిల్లెట్ టిఫిన్స్, ఫుడ్ బాస్కెట్ ప్రోగ్రామ్, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించి వారితో మాట్లాడారు.
Read also: AP Government: ఆర్టీసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం
ఆప్యాయంగా మాట్లాడిన సీఎం

• నమస్తే సర్ ….అంటూ సీఎం చంద్రబాబును పలకరించిన అంగన్వాడీ చిన్నారులు. వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడిన సీఎం
• షైనింగ్ సెంటర్స్ తమ పిల్లలకు ఉపయోగపడుతున్నాయని, పిల్లల్లో ఎదుగుదల కనిపించిందని సీఎంకు తెలిపిన మహిళలు.
• అనంతరం నారావారిపల్లె లో రూ.1.4 కోట్లతో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ ప్రారంభం
• రూ.4.27 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ ప్రారంభం
• కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సంజీవని ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
• రూ.70 లక్షలతో ఎ-రంగంపేట- భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారి ప్రారంభం
• నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు, మూలపల్లి చెరువు, మరో 4 చెరువులకు నీటిని తరలించేందుకు శంకుస్థాపన కార్యక్రమం
- ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్, ఇతర ప్రజా ప్రతినిధులు
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: