📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu news: AP: మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు కీలక స్పష్టత

Author Icon By Tejaswini Y
Updated: December 17, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ(AP) రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పీపీపీ (Public–Private Partnership) విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, దీనిపై వైసీపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఉద్యమానికి దిగింది. ఈ అంశంపై కోటి సంతకాలు సేకరించిన వైసీపీ, మాజీ సీఎం జగన్(Y. S. Jagan Mohan Reddy) రేపు (గురువారం) గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు.

Read also: Sreecharani: శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

పీపీపీ మోడల్‌తోనే మెరుగైన వైద్య సేవలు

రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు(Chandrababu), పీపీపీ విధానంలో చేపడుతున్న మెడికల్ కాలేజీలపై స్పష్టత ఇచ్చారు. పీపీపీ మోడల్ ద్వారా నాణ్యమైన సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని తెలిపారు. కొందరు కావాలని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్నప్పటికీ, అవి పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాలేజీల నిర్వహణ నిబంధనలు, నియంత్రణ అన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని వెల్లడించారు.

AP CM Chandrababu Naidus key clarification on medical colleges

రుషికొండ ప్యాలెస్ ఉదాహరణతో వైసీపీపై సీఎం తీవ్ర విమర్శలు

ఈ కళాశాలల్లో 70 శాతం మంది ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవల పథకం వర్తిస్తుందని, అలాగే సీట్ల సంఖ్య కూడా పెరిగిందని సీఎం వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి ప్రజాధనం వృథా చేశారని విమర్శించారు. అదే డబ్బుతో రెండు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయవచ్చని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రుషికొండ భవనం “వైట్ ఎలిఫెంట్”గా మారిందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ(Public–Private Partnership) విధానంలోనే పలు ప్రాజెక్టులు అమలు చేస్తోందని చంద్రబాబు గుర్తుచేశారు. విమర్శలకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిందేనని అన్నారు. రహదారుల నిర్మాణం కూడా పీపీపీ ద్వారానే జరుగుతోందని, అలా చేస్తే అవి ప్రైవేటు వ్యక్తులవైపు వెళ్లిపోతాయా అని ప్రశ్నించారు. గత పాలనలో జరిగిన తప్పుల వల్ల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. ప్రస్తుతం అప్పులను రీ–షెడ్యూల్ చేస్తూ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Politics Chandrababu Naidu Coalition Government AP Medical Colleges Andhra Pradesh PPP model YS Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.