ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు భోగి పండుగ (జనవరి 14) సందర్భంగా తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భోగి పర్వదినం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు ఆరంభంగా భోగి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఇది ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాలకు సంకేతమని సీఎం తెలిపారు.
Read also: AP: పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ప్రకటన విడుదల
ఈ మేరకు ఆయన మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. “దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రజల ఆశావహ దృక్పథంతో కూడిన ఆలోచనలు సాకారం కావాలి. అందుకు నేను మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను” అని చంద్రబాబు పేర్కొన్నారు.ప్రతి ఒక్కరి జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ మరోమారు భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన తన సందేశంలో వివరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: