📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: AP : పంటలకు భరోసా కల్పిస్తాం సిఎం చంద్రబాబు

Author Icon By Saritha
Updated: November 27, 2025 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమీక్షలో బాబు

విజయవాడ : రాష్ట్రంలో పండుతున్న అన్ని పంటలకు ధరలు తగ్గకుండా… ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా… రైతులకు(AP) ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(CM Chandrababu) నాయుడు ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లల్లోనూ… చెల్లింపుల్లోనూ ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించారు. అలాగే పత్తి, అరటి, జొన్న వంటి పంటలు సాగు చేసే రైతులకు ఉన్న ఇబ్బందులను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రబీ సీజన్ లో 50.75 లక్షల టన్నుల మేర ధాన్యాన్ని సేకరించాలనే అంచనాలు పెట్టుకున్నట్టు అధికారులు వివరించారు.

ధాన్యం కొనుగోళ్ల నిమిత్తం రూ.13,451 కోట్లు చెల్లింపులు జరపాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయాలి. దీనికి సంబంధించిన నిధుల విషయంలో ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవాలి. భారీ వర్షాలు ఉంటాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా గోనె సంచులను రైతులకు అందించాలి. అని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Read also: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.7.27 కోట్లు

పత్తి కొనుగోళ్లలో కొత్త విధానాల వల్ల రైతులు ఇబ్బందులు

పత్తి కొనుగోళ్లల్లో(AP) సీసీఐ తెచ్చిన కొత్త విధానాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో సమీక్ష నుంచే కేంద్ర టెక్స్టైల్స్ కార్యదర్శి నీలం రావుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పత్తి కొనుగోళ్ల విషయంలో ఎదురవుతున్న సమస్యను వివరించారు. కొత్తగా తెచ్చిన విధానాల వల్ల రాష్ట్రంలోని పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని నీలంరావుకు ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉండడంతో సమస్యను త్వరితగతిన పరిష్కారించాలని కేంద్ర టెక్స్టైల్స్ శాఖ కార్యదర్శిని సీఎం కోరారు. అనంతరం సమీక్షలో సీఎం మాట్లాడుతూ… పత్తి కొనుగోళ్ల అంశంలో ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరపాలి.

ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలుకు బాధ్యతలు అప్పజెప్పాలి. అరటి, జొన్న ధరలపై ఉన్న సమస్యలను అధిగమించాలి. వీటికి సంబంధించి స్థానిక ట్రేడర్లు, ఎగమతి దారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలి. అలాగే ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ రైస్ మిల్లర్లతో సంప్రదింపులు జరపాలి. వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. భారీ వర్షాలు, వచ్చే అవకాశం ఉంటే.. రైతులను అలెర్ట్ చేయడంతోపాటు పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమీక్షలో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AgricultureDepartment Ap BananaProcurement CMChandrababuNaidu CottonProcurement CropAssurance FarmersSupport JonnaProcurement Latest News in Telugu MSP PaddyProcurement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.