దేశంలో కోవిడ్ (Covid) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రోజుకు వెయ్యి మందికి పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు (MT Krishnababu)అధికారులను ఆదేశించారు.సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశమని చెప్పారు.ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు తక్కువగానే ఉన్నా, జ్వర లక్షణాలున్నవారికి పరీక్షలు తప్పనిసరి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ టెస్టులు ఉండేలా చూడాలని సూచించారు.పాత జీజీహెచ్ ఆసుపత్రుల్లో రోజుకు 100 పరీక్షలు, కొత్త జీజీహెచ్‌లలో 50 పరీక్షల సామర్థ్యం కల్పించాలన్నారు. దీంతో జిల్లాల్లో అనుమానాస్పద రోగులను త్వరగా గుర్తించడం సులభమవుతుంది.
అవసరమైన కిట్ల లభ్యతపై దృష్టి
పరీక్షలకు అవసరమైన RT-PCR, RNA, VTM కిట్ల లభ్యతపై సమీక్ష నిర్వహించారు. నెల రోజులకు సరిపడా కిట్లు స్టాక్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల పీపీఈ కిట్లు, 60 వేలకు పైగా వీటీఎం కిట్లు అందుబాటులో ఉన్నాయని అధికారుల సమీక్షలో వెల్లడైంది. ఆసుపత్రుల అవసరాలకు అనుగుణంగా సరఫరా నిరంతరం కొనసాగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
సమావేశంలో పాల్గొన్న అధికారులు
ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ కమిషనర్ జి. వీరపాండియన్, ఎంసీడీ వి. గిరీశ్, డీఎంఈ డాక్టర్ నరసింహం, డాక్టర్ ఎ. సిరి తదితర అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ పరిస్థితిని ముందే అంచనా వేసి చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం.
Read Also : AP : 9 ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్ లు