📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: ఇంటర్ ఫస్టియర్ పరీక్షా విధానంలో మార్పులు

Author Icon By Saritha
Updated: February 13, 2026 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంటర్ బోర్డు మార్గదర్శకాలు విడుదల

విజయవాడ: (AP) రాష్ట్రంలో ఈనెల 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఆరంభమవుతున్నాయి. ఇందుకుగానూ ఇంటర్మీడియట్ విద్యా మండలి (Board of Intermediate Education) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థులు మొత్తం 10.57.899 మంది ఉండగా వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,31,275, ద్వితీయ సంవత్సరం వారు 5,26,624 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది సిలబస్తో పాటు ప్రశ్నపత్రాల విధానంలోనూ కొన్ని మార్పులు, చేర్పులు తీసుకువచ్చారు. ఈసారి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు 32 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు.

Read Also: AP Assembly: రసవత్తరంగా సాగిన ప్రశ్నోత్తరాలు

Changes in Inter First Year Examination Pattern

32 పేజీల బుక్లెట్లో నే రాయాలి అదనపు పేపర్లు ఇవ్వరు

ఇప్పటి వరకు సమాధానాలు రాయడానికి 24 పేజీల బుక్లెట్ ఇస్తుండేవారు. (AP) ఈసారి మాత్రం 32 పేజీల బుక్ లెట్ ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని ప్రశ్నలకు అందులోనే సమానాధాలు రాయాల్సి ఉంటుంది. అదనంగా ఎలాంటి పేజీలు ఇవ్వరు. బోటనీ నుంచి 43, పార్ బిలో జువాలజీ నుంచి 42 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటికి జవాబులు రాసేందుకు విడివిడిగా 24 పేజీల 2 బుక్లెట్లు ఇస్తారు. బుక్లెట్లపై వృక్ష శాస్త్రం, జంతుశాస్త్రం అని ప్రత్యేకంగా పేర్కొంటారు. ఈ ఏడాది నుంచి ఫస్ట్ ఇయర్ వారికి ఒక్క మార్కు ప్రశ్నలు ఉంటాయి. సెకండ్ ఇయర్ ప్రశ్నపత్రాల్లో ఎలాంటి మార్పు ఉండదు. అదే విధంగా ఆర్ధిక శాస్త్రం, పౌరశాస్త్రం, చరిత్ర సబ్జెక్టుల మార్కుల్లో ఎలాంటి మార్పు లేదు. అయినా ప్రశ్నల సంఖ్య పెరగడంతో వీటికి సైతం 32 పేజీల బుక్లెట్ ఇస్తారు.

మార్కుల విధానంలో మార్పులు చేర్పులు

భౌతిక, రసాయన, జీవశాస్త్రం సబ్జెక్టులకు మొదటి ఏడాదిలో 85 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఈ సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులు వస్తే పాసయినట్లే. ఆ లెక్కన 29.75 మార్కులు రావాల్సి ఉండగా, 29 మార్కులు వచ్చిన కూడా ఉత్తీర్ణులైనట్లే పరిగణిస్తారు. ద్వితీయ సంవత్సరంలో 85 మార్కులకు గానూ 30 మార్కులు తెచ్చుకోవాలనే నిబంధనను పెట్టారు.
రెండు సంవత్సరాలకు కలిపి 35 శాతం కింద 59.5 మార్కులు సాధించాల్సి ఉండగా, 59 మార్కులను ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ఈ అర్ధ మార్కును సర్దుబాటు చేస్తున్నారు.
రెండో ఏడాదిలో ప్రాక్టికల్స్ 30 మార్కులకు ఉత్తీర్ణత మార్కులను 10.5 నుంచి 11కు పెంచారు.
గణితం 12, రసాయనశాస్త్రం 9, భౌతికశాస్త్రం 9. వృక్షశాస్త్రం 5, జంతుశాస్త్రంలో 4 ప్రశ్నలుగానూ సబ్జెక్టుల వారీగా ఒక్క మార్కు ప్రశ్నలనూ ఉండనున్నాయి. అన్ని కేంద్రాల్లోను కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిని జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఇంటర్మీడియట్ బోర్డుకు అనుసంధానం చేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఒక్కో జిల్లాను ఒక్కో అధికారి పర్యవేక్షించనున్నారు. ఆయా కళాశాలలు సీసీ కెమెరా పుటేజ్ హార్డ్ డిస్క్లను ఆరఓలకు ఇస్తాయి. అక్కడ వాటిని భద్రపరచనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:


Andhra Pradesh Board of Intermediate Education First Year Students Intermediate Public Exams Latest News in Telugu Telugu News Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.