📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

Latest News: AP: మంత్రుల పని తీరు పై చంద్రబాబు సీరియస్

Author Icon By Saritha
Updated: December 11, 2025 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(CM Chandrababu) నాయుడు, కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, నలుగురు మంత్రులు ఆలస్యంగా రావడం సీఎం ఆగ్రహానికి కారణమైంది. ఇప్పటికే శాఖాధిపతుల సమావేశంలో కూడా కొందరు మంత్రుల పనితీరు సరైన స్థాయిలో లేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు, కేబినెట్ వేళ మరింత కఠినంగా స్పందించారు.

Read also: ఏపీ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. హెల్త్ కార్డులు అప్డేట్..!

మంత్రులకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

కేబినెట్(AP) సమావేశానికి సమయానికి హాజరుకాలేకపోయిన ఆనం, సంధ్యారాణి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్‌లను సీఎం నేరుగా నిలదీశారు. మంత్రులు క్రమశిక్షణ పాటించకపోవడం అసహ్యం అని, ఇకపై కేబినెట్ సమావేశాలకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా సహించబోమని హెచ్చరించారు. తాను కూడా శాఖాధిపతుల సమావేశానికి 10 నిమిషాలు ఆలస్యమై వెంటనే అందరి ముందూ క్షమాపణ చెప్పానని గుర్తుచేసి, మంత్రులు కూడా తమ తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు. మీకు ముందస్తుగా సమయం తెలిసినప్పుడు ఎందుకు ప్లాన్ చేసుకోలేకపోతున్నారు? అంటూ ప్రశ్నించారు.

కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించనున్నారు. అక్కడ పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకాలు, జిల్లా కమిటీల ఏర్పాటుపై త్రిసభ్య కమిటీతో చర్చించనున్నారు. జిల్లాల కొత్త బాధ్యతలు, పార్టీ పటిష్టత, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశాల్లో మంత్రుల పనితీరుపై చంద్రబాబు చూపుతున్న కట్టుదిట్టమైన వైఖరి, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పనితీరును మరింత క్రమబద్ధంగా మార్చే దిశలో కీలక మలుపుగా భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh politics AP Cabinet Chandrababu Naidu Latest News in Telugu Ministers Discipline TDP Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.