ఆంధ్రప్రదేశ్(AP) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర సామర్థ్యాన్ని చాటేందుకు సిద్ధమయ్యారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సమావేశాలకు ఆయన హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టి సారించింది. ఈ పర్యటనలో మంత్రి నారా లోకేష్, టీడీపీ నాయకులు టీజీ భరత్ తదితరులు చంద్రబాబుతో పాటు ఉన్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో బాబు బృందం చర్చలు జరిపింది.
Read also: Kalichetti Appalanaidu : వైసీపీకి ఘోర ఓటమి ఖాయం? అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు!
సీఎంల మధ్య పెట్టుబడుల పోటీ
ఈసారి దావోస్ వేదికపై పెట్టుబడుల కోసం ఆసక్తికరమైన పోటీ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ తమ తమ రాష్ట్రాల అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం జూరిచ్‌కు చేరుకున్న చంద్రబాబు, అక్కడే భారత రాయబారి మృదుల్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఉన్న ఫార్మా, మెడికల్ ఎక్విప్‌మెంట్స్ రంగాల్లో ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో 25 కొత్త పారిశ్రామిక విధానాలను అమల్లోకి తీసుకొచ్చామని, ఏఐ, క్వాంటం టెక్నాలజీ వంటి ఆధునిక రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
AI, క్వాంటం టెక్‌పై దృష్టి
ఈ పర్యటనలో చంద్రబాబు మొత్తం 36 కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలీవర్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో నేరుగా చర్చలు జరగనున్నాయి. యువతలో పారిశ్రామిక ఆలోచనలను పెంపొందించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా మెంటార్‌షిప్ అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే స్టార్టప్‌లకు ప్రోత్సాహకంగా రూ.50 కోట్లతో ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గత 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని చంద్రబాబు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: