ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మంత్రులు, ఉన్నతాధికారులతో శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల పునర్విభజనపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గత నెల 27న విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ అనంతరం అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇవ్వగా, ఆ గడువు నేటితో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు నమోదైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Read also: TTD: నూతన సంవత్సరానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు
Chandrababu Naidu
సమీక్ష సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. రాజంపేటను కడప జిల్లాలో, రాయచోటిని మదనపల్లె జిల్లాలో, గూడూరును నెల్లూరు జిల్లాలో, పొదిలిని ప్రకాశం జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపడం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అందిన అన్ని అభ్యంతరాలను క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ప్రకటించిన మూడు కొత్త జిల్లాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 29కు చేరనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: