గుర్తేడు తాశీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్
గుర్తేడు(చింతూరు) : పోలవరం జిల్లా గుర్తేడు మండలాన్ని గురువారం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ దినేష్కుమార్, రంప చోడవరం యంయల్ఎ మిరియాల శిరీషాదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. (AP) గుర్తేడులో ఉన్న ప్రభుత్వ భవనంలో తాత్కలిక తాశీల్దార్ కార్యాలయం, తాత్కలిక మండల అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2025 అక్టోబర్ లోనే వై రామవరం మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. వై రామవరం మండలంలోని మొత్తం 17 పంచాయితీల్లో బుడ్డగండి, పాతకోట, కానివాడ, ధారగడ్డ, గుర్తేడు 5 పంచాతీయలలోని 59 రెవెన్యూ గ్రామాలను కలిపి గుర్తేడు మండలంగాను, మిగిలిన వె రామవరం, యార్లగడ్డ, చవిటిదిబ్బల, పి. యర్ర గొండ, పనసలపాలెం, కోట, యర్రంరెడ్డిపాలెం, చింతల పూడి, దాలిపాడు, దేవరమడుగుల, చామగడ్డ, కె. ఎర్రగొండ 12పంచాయితీల్లో 78 రెవెన్యూ గ్రామాలను పాత వై. రామవరం మండలంగా ఉంచారు.
Read Also: Chandrababu Naidu: రాయలసీమ ఎత్తిపోతలకు చంద్ర గ్రహణం!
గుర్తేడు మండలం ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే శిరీషాదేవి
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమములో (AP) రంపచోడవరం యంయల్ఎ మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ ఆదివాసిల దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కే దక్కుతుందని, రంపచోడవరాన్ని జిల్లాగా చేసిన ఘనత చంద్రబాబునాయుడుదే అని, ఈ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జీవితాంతం బుణపడి ఉండాలని ఆమె అన్నారు. ఆదివాసీలు, కొండరెడ్లపై ప్రత్యేక అభిమాన్ని ముఖ్యంత్రి చంబ్రాబునాయుడు(CM Chandrababu) మరో సారి చాటుకున్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. ఇప్పటికే రంపచోడవరం జిల్లాలోని 12 మండలాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చట్టామని, అనేక మారు మూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించ టానికి నిధులు మంజూరు అయ్యాయని, ప్రభుత్వం ఇచ్చిన ఈ బృహత్తర అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.
అదే వేదికపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చాపరాయి మటన ఈ ప్రాంత చరిత్రను మార్చిందని, ఎటువంటి కమ్యూనికేషన్ లేని మారుమూల గ్రామాలకు నేడు మోబైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, అనేక గ్రామాలకు రహదారుల నిర్మాణం జరుగు తుందని, త్వరలోనే మండలానికి అవసరమైన అన్ని భవనాలను నిర్మాణం చేపట్టి పూర్తి స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కార్యక్రమ ములో రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, ఇన్చార్జ్ చేసి స్మరణ్రాజ్, రంప చోడవరం సబ్కలెక్టర్, చింతూరు ఇన్చార్జ్ పివో శుభం నోక్వాల్, రాష్ట్ర యస్.టి. కమిషన్ సభ్యులు గొర్లె సునిత ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: