📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

AP: జగన్‌ తప్పులు చేసి మాపై ఆరోపణలు చేస్తున్నారు: చంద్రబాబు

Author Icon By Saritha
Updated: February 5, 2026 • 4:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టి, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, ఇది క్షమించరాని మహా పాపం అని ఆయన అభివర్ణించారు. దేవుడితో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను, అపవిత్ర ఘటనలను గుర్తుచేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉండవల్లిలో కూటమి నేతల కీలక సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

Read Also: YS Jagan Visit: రేపు జోగి రమేష్‌ కుటుంబానికి జగన్‌ పరామర్శ

Chandrababu expressed strong anger over the adulterated ghee issue.

గత ఐదేళ్లలో హిందూమతంపై దాడి

వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు భక్తులు (AP) తిరుమలకు రావాలంటే అనుమానించే పరిస్థితి ఏర్పడిందని, జగన్ తప్పులు చేసి తమపై ఆరోపణలు చేస్తున్నారని CM చంద్రబాబు దుయ్యబట్టారు. దుర్మార్గాలు చేసి తిరిగి ఎదురుదాడి చేస్తున్నారని, శ్రీవారిపై జగన్‌కు నమ్మకం ఉంటే డిక్లరేషన్‌ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏకసభ్య కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని తెలిపారు. జగన్ తనతోనే కాదు, దేవుడితో కూడా పెట్టుకున్నారని విమర్శించారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలు, సంప్రదాయాలపై దాడులు పరాకాష్టకు చేరాయని చంద్రబాబు విమర్శించారు. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో తిరుమల రెండు కొండలే, ఏడు కొండలు కాదని మాట్లాడినప్పుడు మేం వ్యతిరేకించాం. విజయనగరంలో రాముడి విగ్రహం తల నరికివేస్తే, అక్కడికి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలనుకున్న నాపైనే కేసు పెట్టారు. అంతర్వేదిలో రథం తగలబడితే ఎలుకలు కొరికాయని చెప్పారు. ఆంజనేయుడి విగ్రహాన్ని పగలగొడితే ‘అదో బొమ్మే కదా, ఇంకోటి పెట్టుకోండి అని అప్పటి పాలకులు ఎంతో గర్వంగా మాట్లాడారు. ఇవన్నీ చేస్తూ, తిరిగి మాపైనే నిందలు వేశారు అని ఆయన మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh CM Chandrababu naidu Ghee Adulteration Latest News in Telugu Telugu News Temple Issues tirumala laddu controversy TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.