AP: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలు, సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ (NTR Trust) ప్రస్థానం కొనసాగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ట్రస్ట్ స్థాపించి నేటికి 29 సంవత్సరాలు పూర్తిచేసుకుని 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో సీఎం పోస్ట్ చేశారు.
Read Also: TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
అధికారం అంటే పేదల సేవ అనే భావనతో ప్రజా సేవకు నిజమైన అర్థాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారి బాటలో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సహాయం వంటి కార్యక్రమాల ద్వారా ట్రస్ట్ సమాజంలో తిరుగులేని ముద్ర వేసిందన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యమని ప్రశంసించారు.
అలాగే మహిళా సాధికారత, జీవనోపాధి కల్పనలోనూ ట్రస్ట్ కీలక సేవలు అందిస్తోందని తెలిపారు. కష్టాల్లో ఉన్నవారికి మరింత చేరువయ్యేలా ట్రస్ట్ సేవలను విస్తరిస్తూ అత్యంత సమర్థ సంస్థగా ముందుకెళ్తాంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ఆమె బృందానికి అభినందనలు. ట్రస్ట్ కార్యక్రమాలకు వివిధ రూపాల్లో సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాగే కొనసాగుతూ కోట్ల మందికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: