📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP: ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్’ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం!

Author Icon By Anusha
Updated: December 4, 2025 • 1:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ (AP) కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, సరఫరా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో రూ.21,000 కోట్ల భారీ ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్’ ప్రాజెక్టు (‘Green Energy Corridor’) కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో (AP) 1,200 కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ లైన్లు వేసి ఏకంగా 10,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖతో రాష్ట్ర అధికారులు జరిపిన చర్చల అనంతరం ఈ కీలక ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.

Read Also: AP: ఆసక్తికరంగా మద్యం అమ్మకాల లెక్కలు

ప్రాజెక్టు అమలుకు సంబంధించిన అనుమతులు ఇప్పటికే దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ(SRPC), కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(CERC)ల నుంచి వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను 2026-27 కేంద్ర బడ్జెట్లో కేటాయించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ కారిడార్ ప్రధానంగా రాయలసీమ,

AP: Center approves ‘Green Energy Corridor’ project!

నిధుల కేటాయింపుపై చర్చలు కొనసాగుతున్నాయి

ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య 1,200 కిలోమీటర్ల మేర హైటెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంది.ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ (సౌర), విండ్ (పవన) విద్యుత్ ఉత్పత్తికి అత్యంత అనుకూలమైన ప్రాంతాలు రాయలసీమ (కడప, అనంతపురం, కర్నూలు), ఉత్తరాంధ్ర ప్రాంతాలే. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతాల నుంచి ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్‌ను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా, సమర్థవంతంగా తరలించడానికి వీలు కలుగుతుంది.

ఈ ప్రాజెక్టులో ఇది రెండో దశగా భావిస్తున్నారు. మొదటి దశలో 2015లోనే అనంతపురం నుంచి రామాయపట్నం వరకు రూ. 21,800 కోట్లతో 9,700 కిలోమీటర్ల విద్యుత్ లైన్ల పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధికారులు ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం నిధులను గ్రాంటుగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా.. కేంద్రం మాత్రం 30 శాతం గ్రాంటుగా ఇవ్వడానికి మొగ్గు చూపుతోంది. ఈ నిధుల కేటాయింపుపై చర్చలు కొనసాగుతున్నాయి.

ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది

ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన రంగానికి ఒక బలమైన మద్దతుగా నిలవనుంది. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 80,798 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. కూటమి ప్రభుత్వం జూన్ నెల నుంచి 38 సంస్థలతో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ పవర్ (PSP) ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.

రానున్న మూడేళ్లలో మరో 15 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోనే కేంద్రీకృతమవుతున్నాయి. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో దాదాపు 5,000 మెగావాట్ల యూనిట్లు పనిచేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే, ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.

వీలింగ్ ఛార్జీల భారం

ఈ అదనపు విద్యుత్‌ను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ప్రస్తుతం రాష్ట్రం పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు (PGCIL) చెందిన నెట్‌వర్క్‌ను వినియోగించాల్సి వస్తుంది. దీనివల్ల రాష్ట్రం భారీ మొత్తంలో వీలింగ్‌ ఛార్జీలు చెల్లించాల్సిన భారం పడుతోంది. కొత్త గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో రాష్ట్రానికి ఈ వీలింగ్ ఛార్జీల భారం తగ్గుతుంది, తద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థ ఆర్థికంగా మరింత పటిష్టమవుతుంది.

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేయడానికి, ఈ కారిడార్ ద్వారా కీలకమైన సబ్‌స్టేషన్లను అనుసంధానిస్తున్నారు. ఓర్వకల్లు, గనిలోని 765 కేవీ సబ్‌స్టేషన్లతో పాటు, నక్కపల్లి, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం తదితర 17 (400 కేవీ) సబ్‌స్టేషన్లను ఈ కారిడార్‌కు కలుపుతున్నారు.

గ్రీన్ హైడ్రోజన్ పార్కు

ఈ అనుసంధానం వల్ల ఏదైనా సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం ఏర్పడితే, వెంటనే మరో సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్‌ను అందించే వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.విశాఖపట్నం జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ, జెన్‌కో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ హైడ్రోజన్ పార్కు, కాకినాడలో గ్రీన్‌కో సంస్థ ఏర్పాటు చేస్తున్న గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్రాజెక్టులు వంటి పర్యావరణహిత ప్రాజెక్టులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అవసరం.

కొత్త విద్యుత్ నెట్‌వర్క్ ఏర్పాటు ఈ కీలక ప్రాజెక్టుల పురోగతికి కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే మరింత ముందుకు వెళ్లడానికి బలమైన మౌలిక వసతి లభించినట్టు అవుతుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

21000 crore project Andhra Pradesh renewable energy AP electricity network AP green energy corridor high tension power lines latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.