(AP) ఏపీలో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) శాంతిభద్రతల పరిరక్షణకు కోసం స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీలతో సంబంధం లేకుండా నిందితులపై కేసులు నమోదు చేయాలని ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Tirumala Laddu Issue: లడ్డూ వివాదంపై స్పందించిన చంద్రబాబు
మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద జరిగిన దాడి ఘటనపై ఆరా తీసిన సీఎం, చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. (AP) ఈ క్రమంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. రాజకీయ పార్టీలు ఎల్లపుడు రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్య విలువలకు లోబడి వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రం లో ఉద్రిక్తతలకు దారి తీసే ఎలాంటి చర్యలనైనా సహించే ప్రసక్తే లేదన్నారు. ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: