📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: చంద్రబాబు, పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు

Author Icon By Saritha
Updated: February 14, 2026 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP)ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కొందరు నేతలపై దుర్భాషలాడుతూ, తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు రాజశేఖర్ రావు అనే వ్యక్తిపై ఫిర్యాదు అందింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: AP Budget 2026-27: మూలధన వ్యయాన్ని పెంచిన ప్రభుత్వం

కేసు నమోదు సైబర్ క్రైమ్ పోలీసులు

ఈ సందర్భంగా(AP) సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు మాట్లాడుతూ…  సోషల్ మీడియా ద్వారా ఫొటోలను మార్ఫింగ్ చేసి, అసత్య ప్రచారం చేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని వెల్లడించారు. ప్రముఖుల ఫొటోలను ఎడిట్ చేసి, అసభ్యకరంగా చిత్రీకరిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh CM chandrababu Cyber Crime Deputy CM Pawan Kalyan Latest News in Telugu Minister Nara Lokesh photo morphing case Social Media Abuse Telugu News Vijayawada police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.