విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధతకు కేంద్రం సన్నద్ధమవుతుంది. విభజన చట్టాల అనంతర పరిణమాలు, నిర్ణయాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎపిలో ఇప్పటికే దగ్గర, దగ్గర దశాబ్ద కాలం నుంచి అమరావతి రాజధానిగా ఉంది. దేశ మ్యాప్ లో సైతం అమరావతిని ఎపి రాజధానిగా సూచించారు. అయితే సాంకేతిక అంశాల కారణంగా అమరావతి రాజధాని చట్టబద్దతకు అనుమతి రాలేదు. ఎపి తాజా కేంద్రమంత్రి మండలిలో ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. ఎపి విభజన చట్టం పార్ట్ 2 కింద 5(1) నిర్ణయించిన తేదీ నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. పార్ట్ 2 కింద 5(2) సబ్ సెక్షన్ 5(1)లో పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది.
Read also: road accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఐదుగురు మృతి
Legal status for Amaravati
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేస్తారు. పార్ట్ 25(2) సబ్సెక్షన్ లో ఆంధ్రప్రదేశకు నూతన రాజధాని ఏర్పాటవుతుంది అనేచోట అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ కి నూతన రాజధాని ఏర్పాటైందని పేర్కొంటారు. వాస్తవానికి 10 ఏళ్లపాటు 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు 2024 జూన్ 2తో ముగిసింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపై కేంద్రానికి నోట్ అందజేసింది. ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో కేంద్ర హోంశాఖ చెప్పాలంది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజప్తి చేసింది. సంబంధిత కేంద్ర శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరడంతో పలు మంత్రిత్వ శాఖలు ఇప్పటికే తమ అభిప్రాయాలు వ్యక్తపరిచాయి. పట్టణాభివృద్ధి, న్యాయ శాఖలు ఇంకా అభిప్రాయాలు చెప్పాల్సి ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిసింది.
అమరావతిలో వేగంగా అభివృద్ధి పనులు
ఈ మేరకు కేబినెట్ నోట్ తయారీలో హోంశాఖ నిమగ్నమైనట్లు అధికారులు వెల్లడించారు. రాజధాని అమరావతి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నది.. దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ తమ సంస్థల నిర్వహణకు ఎంఓయూలు చేసుకున్న సంగతి తెలిసిందే. డేటా సెంటర్ సహా ఎన్నో కంపెనీలు రానున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు రాజధాని అమరావతి నగర విస్తరణలో భాగంగా రెండో విడత భూసమీకరణకు యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. తుళ్లూరు మండలంలో 3 గ్రామాలు, పల్నాడు జిల్లా అమరావతి మండలంలో 4 గ్రామాల పరిధిలో రైతుల నుంచి భూమి సమీకరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: